వీధి కుక్కలను నగరవాసులు దత్తత తీసుకోవాలంటూ మేయర్ చేసిన వ్యాఖ్యలను వివాదాస్పద దర్శకుడు, ప్రముఖ నిర్మాత రామ్ గోపాల్ వర్మ తప్పుబట్టారు. మేయర్ విజయలక్ష్మీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.. వర్మ. జంటనగరాల్లో కుక్కలను ఇంటికి తీసుకెళ్లి ఆహారం ఇవ్వాలంటూ ఆమెపై సెటైర్లు వేశారు.
మూడు రోజుల క్రితం అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలిసిందే. అభం శుభం తెలియని నాలుగేళ్ల పిల్లవాణ్ని శునకాలు పొట్టన బెట్టుకున్న దృశ్యాలు అందర్నీ కంటతడి పెట్టించాయి. అంబర్‌పేటకు చెందిన ప్రదీప్ అనే బాలుడు నడుచుకుంటూ వస్తుండగా కుక్కలు చుట్టుముట్టి తీవ్రంగా గాయపరిచి బాలున్ని పొట్టనబెట్టుకున్నాయి. దీనికి ప్రభుత్వం, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని ప్రతిపక్షాలు, ప్రజలు విమర్శలు గుప్పించారు. తాజాగా, ఈ ఘటనపై నగర మేయర్ విజయలక్ష్మీ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాన్ని రాజేస్తున్నాయి. వీధి కుక్కలను నగరవాసులు దత్తత తీసుకోవాలంటూ మేయర్ చేసిన వ్యాఖ్యలను వివాదాస్పద దర్శకుడు, ప్రముఖ నిర్మాత రామ్ గోపాల్ వర్మ తప్పుబట్టారు.
వీధి కుక్కలను నగరవాసులు దత్తత తీసుకోవాలంటూ మేయర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను డాగ్ లవర్‌నన్న మేయర్.. వీధి శునకాలను ఆహారం పెట్టొద్దని తాను నోటితో చెప్పలేనన్నారు. ఓ మహిళ శునకాలకు రోజూ మాంసం పట్టేదన్న మేయర్.. రెండు రోజులపాటు ఆమె లేకపోవడంతో ఆకలిగొన్న శునకాలు పసివాడిపై దాడి చేసి హతమార్చాయన్నారు. ఒక్కో సర్కిల్‌లో 20 శునకాలను తీసుకొని క్లీన్ చేస్తే బాగుంటుందని.. అందుకోసం నెలకు 600 కుక్కల చొప్పున ఎవరైనా వాటిని పెంచుకోవడానికి ముందుకొస్తే బాగుంటుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
“మేయర్ విజయలక్ష్మీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.. వర్మ. జంటనగరాల్లో కుక్కలను ఇంటికి తీసుకెళ్లి ఆహారం ఇవ్వాలంటూ ఆమెపై సెటైర్లు వేశారు. అంతేకాకుండా నగరంలోని మొత్తం 5 లక్షల కుక్కలను ఒక డాగ్ హోంగా మార్చాలని అందులో వాటి మధ్య మేయర్‌ను ఉంచాలని మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేశారు..” ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయంలో వర్మను సమర్థిస్తున్నారు కొందరు నెటిజన్లు.
Sir @KTRBRS please round up all the 5 lakh dogs into a dog home and make the mayor @GadwalvijayaTRS stay in their middle 🙏 pic.twitter.com/rWe6sC9Ga4
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023
కాగా, ఇప్పటికే ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. వార్తా పత్రికల కథనాలను సమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన న్యాయస్థానం బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. జిహెచ్ఎంసి నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని వ్యాఖ్యానించింది. మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ కలెక్టర్, జిహెచ్ఎంసి కమిషనర్ ను ప్రతివాదులుగా చేర్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకుంటారని జిహెచ్ఎంసిని ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది హైకోర్టు. మేయర్ vs వర్మ వ్యాఖ్యలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hey @GadwalvijayaTRS I WANT TO BITE @KTRBRS @hydcitypolice pic.twitter.com/bXTFqsxzzH
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023