ఈ మధ్యకాలంలో చాలా మందికి అవయవదానంపై అవగాహన ఏర్పడింది. అందుకే చాలా మంది తమ లేదా తమ కుటుంబ సభ్యుల అవయవాలు దానం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి తాను చనిపోతూ.. ఇంకొంతమందికి ప్రాణం పోయాలనుకున్నాడు. ఆ వ్యక్తి త్యాగాన్ని వృద్ధా కానివ్వకుండా కష్ట పడ్డారు రాచకొండ పోలీసులు. గుండె, ఊపిరితిత్తులను ఎల్.బి నగర్ లోని కామినేని హాస్పిటల్ నుంచి 17 కి.మీ దూరంలో ఉన్న బేగంపేట్ కిమ్స్ హాస్పిటల్ కి కేవలం 16 నిమిషాల్లో చేర్చి ఇద్దరి ప్రాణాలను నిలబెట్టారు.
హైదరాబాద్ లోని ఎల్.బి నగర్ కామినేని హాస్పిటల్లో ఉన్న గుండె, లంగ్స్ ను బేగంపేట్ లోని కిమ్స్ హాస్పిటల్ కి తరలించాలి. దానికోసం రాచకొండ సర్కిల్ ట్రాఫిక్ పోలీసులు ఎంతో కృషి చేశారు. ఉదయం 10.01 నిమిషానికి ఎల్.బి నగర్ లో బయలుదేరిన అంబులెన్స్ ను 10.17 నిమిషాలకు బేగంపేట్ కి చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ పీక్ అవరస్స్లో కూడా గ్రీన్ ఛానెల్ని ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా గమ్యస్థానానికి చేర్చారు.
17.6 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 16 నిమిషాల్లో తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేసిన పోలీసులను అందరూ కొనియాడారు. పోలీసులు అందించిన సహకారం వల్లే ఈజీగా చేర్చగలిగామని చెప్పారని రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ అన్నారు.మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.