దేశంలో ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వారికి అందిన సమాచారంతో వనస్థలిపురంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ బెట్టింగ్‌ల కోసం ఈ గ్యాంగ్ ప్రత్యేక యాప్ తయారు చేసి ఈ దందా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
పట్టుబడ్డ ఐదుగురిలో ప్రధాన నిందితుడు దేవినేని చక్రవర్తి అని పోలీసులు తెలిపారు. వీరి నుంచి 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది బ్యాంకుల ఖాతాల్లో రూ. 90 లక్షలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆ బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గతంలో గోవా, బెంగళూరులోనూ చక్రవర్తి భారీ ఎత్తున బెట్టింగ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రైవేట్ సంస్థల పేరుతో బ్యాంకుల్లో ఖాతాలను తెరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అమ్మాయిలిద్దరూ ప్రేమించుకున్నారు.. అలా చేస్తూ అడ్డంగా దొరికిపోయారు!
రెండురోజుల కిందటే.. మాదాపూర్ SOT పోలీసులు.. 18 మంది బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 1 కోటి 62 లక్షల విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 42 లక్షల నగదు, 5 కమ్యూనికేషన్ బోర్డ్స్, 7 ల్యాప్ టాప్స్, 46 స్మార్ట్ ఫోన్లు, 32 నార్మల్ ఫోన్లు,3 టీవీలు, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.