చదువు పూర్తై ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతీ యువకులకు పలు కంపెనీలు మోస పూరిత ప్రకటనలతో ఆకర్షిస్తుంటాయి. ఆ ప్రకటనల పట్ల అవగాహన లేక చాలా మంది మోస పోతుంటారు. ఇదే విధంగా ఓ కంపెనీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అని చెప్పి అమాయకులను మోసం చేసిన ఆ సంస్థ ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే అదే స్వప్పలోక్ కాంప్లెక్స్ లో క్యూనెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్న ప్రధాన నిందితుడు రాజేశ్ ని అరెస్టు చేశామని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ తెలిపారు. పిరమిడ్ స్కీమ్ తో బోగస్ కంపెనీని ఏర్పాటు చేసి అయాయకపు యువతీ యువకులను మోసం చేస్తున్నారని వెల్లడించారు. రూ. 2 లక్షల పెట్టుబడి పెడితే ప్రతి నెల రూ. 20 వేల నుంచి రూ. 60వేల వరకు ఆదాయం వస్తుందని నమ్మించి, ప్రారంభంలో కరెక్టుగానే డబ్బులిచ్చి ఆ తరువాత తప్పించుకుటున్నారు. గొలుసు కట్టు పద్దతిలో మోసాలకు పాల్పడుతున్నారని సిపి తెలిపారు.
స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఆ సంస్థలో పెట్టుబడి పెట్టి మోస పోయారని తెలిపారు. క్యూనెట్ మల్టీలెవల్ మార్కెటింగ్ లో సుమారుగా 159 మంది రూ. 3 కోట్ల మేర డబ్బులు కోల్పోయారని సిపి వెల్లడించారు. ఈ క్రమంలో క్యూనెట్ ను నడిపిస్తున్న రాజేష్ కన్నాను అరెస్టు చేశామని తెలిపారు. ఆయనకు సంబంధించిన 35 బ్యాంక్ అకౌంట్లను, రూ. 54 కోట్ల నగదును ఫ్రీజ్ చేశామని తెలిపారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో దేశంలో వెయ్యికోట్ల బిజినెస్ చేసినట్లు గుర్తించామని సిపి ఆనంద్ చెప్పారు. ఆయుర్వేద మందుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అవగాహన పెంచుకుని జాగ్రత్తపడాలని సిపి సివి ఆనంద్ సూచించారు.