ప్రస్తుతం మనిషిని శాసిస్తున్నది డబ్బు అనడంలో సందేహం లేదు. కోటలు మేడలు కట్టాలన్నా ... కాటికి నలుగురు మోయాలన్నా గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా... ప్రాణం తీయాలన్నా ఒకటే రూపాయి అని ఓ తెలుగు సినిమాలోని పాటలో మాదిరిగానే డబ్బు దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. డబ్బు కోసం ఎన్ని దారుణాలు చోటుచేసుకుంటున్నాయో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇతరుల దగ్గర తమ అవసరాలకు డబ్బు తీసుకుని తిరిగి ఇచ్చే క్రమంలో ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడట్లేదు.
ప్రస్తుతం మనిషిని శాసిస్తున్నది డబ్బు అనడంలో సందేహం లేదు. కోటలు మేడలు కట్టాలన్నా … కాటికి నలుగురు మోయాలన్నా గుప్పెడు మెతుకులు పుట్టాలన్నా… ప్రాణం తీయాలన్నా ఒకటే రూపాయి అని ఓ తెలుగు సినిమాలోని పాటలో మాదిరిగానే డబ్బు దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. డబ్బు కోసం ఎన్ని దారుణాలు చోటుచేసుకుంటున్నాయో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఇతరుల దగ్గర తమ అవసరాలకు డబ్బు తీసుకుని తిరిగి ఇచ్చే క్రమంలో ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడట్లేదు.
ఇంట్లో అవసరం ఉందనో, లేదా వ్యాపారం కోసమని చెప్పి ఇతరుల వద్ద కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకోవటం మనం చూస్తుంటాము. అప్పు తీసుకునేటపుడు ఎంతో మర్యాదగా ప్రవర్తించి ఆ వ్యక్తి నుంచి అప్పు పొందుతారు. కానీ దానిని తిరిగిచ్చే సమయంలో మాత్రం ముప్పుతిప్పలు పెడతారు. ఇదే క్రమంలో ఓ వ్యక్తికి అప్పు ఇచ్చిన వ్యక్తి దానిని తిరిగి రాబట్టుకోలేక మానసిక వేధనకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని బగీరథ కాలనీలో చోటు చేసుకుంది.
కాట్న సత్యనారాయణ అనే వ్యక్తి ఎస్బీ పల్లికి చెందిన ఎర్ర శ్రీనివాస్ కు ఎనిమిది లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం తరువాత తిరిగిచ్చే సమయం వచ్చింది. సత్యనారాయణ తన డబ్బులు ఇవ్వాల్సిందిగా శ్రీనివాస్ ను అడిగాడు. ఇప్పుడిస్తా అప్పుడిస్తా అని చెప్తూ తిప్పించుకోసాగాడు. ఇలా ఏడేళ్లు గడిచిపోయాయి. దీంతో తన డబ్బులు వస్తాయో రావో అని సత్యనారాయణ మానసిక వేధనకు గురై అనారోగ్యం పాలయ్యాడు. ఆసుపత్రిలో చేరిన ఆయనకు తలకు సంబంధించిన శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. అప్పు తీసుకున్న వ్యక్తి ఇంటి చుట్టు తిరిగి తిరిగి అలసిపోయి డబ్బులు రావన్న బెంగతో ఈ రోజు మరణించాడు. ఇదిలా ఉండగా సత్యనారాయణ మృతదేహంతో ఆయన కుటుంబ సభ్యులు అప్పు తీసుకున్న ఎర్ర శ్రీనివాస్ ఇంటి ముందు నిరసనకు దిగారు. ఎర్ర శ్రీనివాస్ డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధించడం వల్లే సత్యనారాయణ మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదని వారు తెగేసి చెప్పారు.