కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి దేశవ్యాప్తంగా నిరసన సెగ తగులుతోంది. తాజాగా అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్‌కు పాకింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఆర్మీ అభ్యర్థులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు.. ఫ్లాట్‌ఫారమ్ మీద ఉన్న రైళ్లపై రాళ్లు విసిరారు. స్టాల్స్‌ని, రైళ్లను తగులబెట్టారు. ఇక నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపడంతో.. ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం సికింద్రబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా..పలువురు గాయపడ్డారు. ఇక మృతి చెందిన యువకుడిని వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్‌గా గుర్తించారు పోలీసులు. వరంగల్ జిల్లా.. ఖానాపురం మండలం దబీర్ పేటకు చెందిన రాకేష్ పోలీస్ కాల్పుల్లో మృతిచెందినట్టు రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Agnipath Programme: ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం! ట్రైన్ తగలబెట్టి ఈ సెల్ఫీలు ఏంటి?
రైల్వే అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఇక గాయపడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
1. జగన్నాథ రంగస్వామి, వయసు 20 సంవత్సరాలు, ఫోన్ నంబర్- 7997445866 R/o మంత్రాలయం, కర్నూలు జిల్లా.
2. కే.రాకేష్ S/o మల్లయ్య , వయసు 20 సంత్సరాలు, R/o చింతకుంట గ్రామం, కరీంనగర్ జిల్లా, ఫోన్ నంబర్-7095040926.
3. J. శ్రీకాంత్ S/o తిరుమలయ్య, వయసు-20 సంవత్సరాలు, పాలకొండ విల్, మహబూబ్ నగర్ జిల్లా.
4.A కుమార్ S/o శంకర్ వయసు-21సంవత్సరాలు, వరంగల్ జిల్లా, ఫోన్ నంబర్- 9581354671.
5.పరశురాం S/O శంకర్, వయసు-22 సంవత్సరాలు, నిజాంసాగర్/ కామారెడ్డి జిల్లా.
6.P మోహన్/S/o నాగయ్య వయసు-20 సంవత్సరాలు, నిజాంసాగర్, కామారెడ్డి జిల్లా.
7. నాగేందర్ బాబు, వయసు-21 సంవత్సరాలు, ఖమ్మం.
8. వక్కరి వినయ్ S/0 వెర్కన్న, వయసు-20 సంవత్సరాలు.
ఇది కూడా చదవండి: Kishan Reddy: అగ్నిపథ్ ఆందోళన.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్!