తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్మించిన సంగతి తెలిసిందే. ఈ పునర్నిర్మాణం జరిగాక మాడ వీధులు, రాజగోపురాలు భక్తులకు కన్నుల విందు కలిగిస్తున్నాయి. రాత్రి పూట రంగురంగుల లైట్ల మధ్య స్వామి వారిని చూసి మన యాదాద్రేనా అన్నట్లుగా భక్తులు ఆశ్చర్యపోతున్నారు.
దాదాపు 2 వేల కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్మించిన సంగతి తెలిసిందే. ఈ పునర్నిర్మాణం జరిగాక మాడ వీధులు, రాజగోపురాలు భక్తులకు కన్నుల విందు కలిగిస్తున్నాయి. రాత్రి పూట రంగురంగుల లైట్ల మధ్య స్వామి వారిని చూసి మన యాదాద్రేనా అన్నట్లుగా భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఇదిలావుంటే ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్వామి అమ్మవార్లు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై.. భారీ ఎత్తున కానుకలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో నిజాం రాణి, ముకర్రం జా మాజీ భార్య ఎస్రా యాదాద్రివాసుడికి ఒక కానుక సమర్పించింది. ఆ వివరాలు..
దివంగత నిజాం ముకర్రం జా మాజీ భార్య, యువరాణి ఎస్రా యాదాద్రి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి బంగారు హారం కానుకగా సమర్పించింది. సుమారు రూ. 5 లక్షల విలువైన 67 గ్రాముల బంగారు ఆభరణాలను విరాళంగా అందజేసింది. ఎస్రా యువరాణి తరపున యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ జి కిషన్ రావు నగలను ఆలయ కార్యనిర్వహణాధికారికి అందజేశారు. ప్రస్తుతానికి యువరాణి ఎస్రా లండన్‌లో నివసిస్తోందని సమాచారం. అప్పుడప్పుడు హైదరాబాద్‌కు రాకపోకలు కొనసాగిస్తుంటుందని, యాదాద్రిని సందర్శించాలనే కోరికను కూడా ఆమె గతంలో వెలిబుచ్చారని కృష్ణారావు తెలిపారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనలో ఆమె యాద్రాద్రి ఆలయాన్ని దర్శించాలని అనుకున్నప్పటికీ గత నెలలో ముకర్రం జా మరణంతో ఆలయాన్ని సందర్శించలేకపోయారని వెల్లడించారు. కాగా, ఈనెల 22వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు మార్చి 3వ తేదీ వరకు జరుగనున్నాయి.
యువరాణి ఎస్రా ప్రస్థానం
యువరాణి ఎస్రా టర్కీలో జన్మించారు. 1959లో అసఫ్ జా హయాంలో రాజవంశీయుడైన ప్రిన్స్ ముకర్రం జాను ఆమె వివాహం చేసుకున్నారు. 15 ఏళ్ల వైవాహిక జీవితంలో వారికి షేఖ్య అనే కుమార్తె, అజ్మెత్ జా అనే కుమారుడు కలిగారు. ప్రస్తుతం అసఫ్ జా హౌస్ అధిపతిగా కుమారుడు అజ్మెత్ జా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం రాజులు దాదాపు 400 ఏళ్ళ పాటు పరిపాలించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కూడా యాదాద్రి ఆలయం ప్రముఖ పుణ్య క్షేత్రంగా వెలుగొందింది. గతంలో యాదాద్రి ఆలయానికి నిజాం రాజులు కానుకలు ఇచ్చారు. వారు ముస్లింలైనా ఆలయంలో పూజాది కార్యక్రమాలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుని మత సామరస్యాన్ని చాటారు. తాజాగా వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. స్వామివారికి నిజాం రాణి ఎస్రా కానుకలు అందించడం గమనార్హం.
Princess Esra Donates ₹5 Lakh Gold Jewellery To Yadadri Temple – HerZindagi https://t.co/P3UdvjfC7X
— News (@hyd) February 27, 2023