శనివారం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణంలోని బేగంపేటకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. అంతక ముందు విశాఖపట్నంలోని ఏయూ కళాశాల్లో జరిగిన భారీ సభలో పాల్గొన్నారు. అక్కడ పలు ప్రాజెక్టలకు శంకుస్థాపనలు చేశారు. మధ్యాహ్నం సమయంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొందారని, ఇక్కడ కుటుంబ పాలన నడుస్తుందని మోదీ తెలిపారు. హైదరాబాద్ ఐటీ రంగానికి హబ్ గా మారిందని, ఐటీలో ముందున్న రాష్ట్రాన్ని మూఢవిశ్వాసలు కలిగిన శక్తులు పాలిస్తున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ లోని బేగంపేట్ లో నిర్వహించిన భాజపా స్వాగత సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే రఘనందన్ రావు, ఎంపీ బండి సంజయ్ పలువురు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ టీఆర్ఎస్ పేరు ఎత్తకుండా మాటల తూటాలు పేల్చారు. తనను, బీజేపీని తిట్టిన పర్లేదు కానీ తెలంగాణ ప్రజలను తిడితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇంకా మోదీ మాట్లాడుతూ.. “మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు భాజపాకు ఒక భరోసా ఇచ్చారు. ఒక్క అసెంబ్లీ సీటు కోసం తెలంగాణ ప్రభుత్వం మొత్తం మునుగోడులో వాలిపోయింది. తెలంగాణాలో ఈ అంధకారం ఎక్కువ రోజులు ఉండదు. మునుగోడు కమల వికాసం కనిపించింది. భవిష్యత్తులో తెలంగాణలో వచ్చేది భాజపా సర్కారేనని ప్రజలు చాటిచెప్పారు. ఐటీ రంగానికి హాబ్ గా ఉన్న హైదరాబాద్ ను అంధవిశ్వాస శక్తులు పాలిస్తున్నాయి.
తెలంగాణాలో భాజపా అధికారంలోకి వచ్చి.. మూఢ విశ్వాసాలను పారతోలుతుంది. ఎర్రజెండా నేతలు అభివృద్ధి, సామాజిక న్యాయానికి వ్యతిరేకులు. ఆధార్, మొబైల్, యూపీఐ వంటి సేవలతో అవినీతి లేకుండా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. అందుకే అవినీతిపరులకు కడుపు మండుతోంది. అవినీతిని సంహించనందుకే కొందరు మోదీని తిడుతున్నారు. నన్ను తిట్టేవాళ్ల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. నన్ను, బీజేపీని తిట్టిన పర్లేదు కానీ తెలంగాణ ప్రజల జోలికి వస్తే సంహించేది లేదు. అవినీతి, కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి తొలి శత్రువులు. భాజపాకు తెలంగామలో సానుకుల పరిస్థితి ఉంది నా తొలి ప్రాధాన్యాత ప్రజలకే..కుటుంబానికి కాదు. తెలంగాణను అవినీతి, కుటుంబ పాలన నుంచి రక్షించడమే నా లక్ష్యం” అని పేరు ఎత్తకుండా తెరాసపై మోదీ విరుచకపడ్డారు.