ఒక ఉన్నత హోదాలో ఉండి.. ప్రజల వద్ద హుందాగా వ్యవహరించాల్సిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తన నోటి దురుసు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ఈ మద్య ఆయన తాండూరు టౌన్ సీఐ రాజేందర్‌రెడ్డి పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన ఒక ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంపై టీఆర్ఎస్ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో నోరు జారి పోలీసుల మనసు నొప్పించానని పేర్కొన్న మహేందర్ రెడ్డి.. ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని.. తన మాటల వల్ల ఎస్సై మనసు నొప్పించినందుకు విచారం వ్యక్తచేస్తున్నా.. తనకు మొదటి నుంచి పోలీసులు అంటే ఎంతో గౌరవం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, శాంతి భద్రతల విషయంలో పోలీసుల కృషి అభినందనీయం అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ అధికారిపై బూతు పురాణం మొదలు పెట్టి తర్వాత విచారణ వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి కి తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. ఆయనకు కేటాయించిన పోలీస్ పైలట్ వాహనాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.