నిత్యం అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది చనిపోతున్నారు. అయితే ప్రాథమిక చికిత్స అందకనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన సమయంలో కసమయస్ఫూర్తితో వ్యవహరిస్తే పోయిన ప్రాణాన్ని కూడా తిరిగి తేవొచ్చు. తాజాగా ఓ కానిస్టేబుల్ అలానే సమయస్ఫూర్తితో సరైన సమయంలో చేసిన పనితో ఓ నిండు ప్రాణాన్ని తిరిగొచ్చింది. అక్కడున్న అందరూ సదరు పోలీస్ కు సెల్యూట్ చేసి.. శభాష్ సార్ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇంతకి ఆ పోలీస్ చేసిన అంత మంచి పని ఏమిటో, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా..
తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ ప్రాంతంలోని మారేడుపల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న అబ్ధుల్ ఖదీర్ అనే కానిస్టేబుల్ తన కొలిగ్స్ తో కలిసి పెట్రోలింగ్ కి వెళ్లారు. అదే సమయంలో మారేడ్ పల్లి మెయిన్ రోడ్డులోని మైసమ్మ దేవాలయం వద్ద ఆర్చ్ పై అలంకార తోరణాన్ని సువేందర్ మకర్ రాకేష్ అనే వ్యక్తి అలంకరణ చేస్తున్నాడు.ఈ క్రమంలో రాకేష్ కి కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఒక్కసారిగా పై నుంచి కిందపడిపోయాడు. అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న ఖదీర్ హుటహుటిన పరిగెత్తుకుంటూ రాకేష్ వద్దకు వెళ్లారు. అదే సమయంలో తనకు తెలిసిన సీపీఆర్ పద్ధతిని రాకేష్ పై అప్లయ్ చేశారు. కొద్ది సేపటికి రాకేష్ లో చలనం రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి కుదుపడినట్లు సమాచారం.
On 14.07.2022 at 1400 hours Sri Abdul Khadeer, PC 3067 of PS Marredpally perform patrolling duty in Patrol Car-I vehicle along with Driver Sri Suresh Thakur, SPO 0498. While the said staff performing patrolling duty https://t.co/BiDKGaTLJl pic.twitter.com/4wNYe88UN7
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) July 15, 2022
అయితే రాకేష్ కి కరెంట్ షాక్ తగిలిన వెంటనే చలనం లేకుండా పడిపోయాడు. దీంతో అందరు అతడు చనిపోయాడు అని భావించారు. కానీ పోలీస్ సీపీఆర్ చేసి.. తిరిగి ఆ యువకడిలో చలనం వచ్చేలా చేశాడు. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పోలీస్ కి సెల్యూట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శభాష్ పోలీస్ అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. మరి.. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Humanity Is Alive! Hatsoff to Abdul for timely help in such an emergency situation
Abdul was on patrol yesterday morning when he came across a 25year-old man with a shock circuit near Maisamma temple on Maredpally main road.He performed CPR on him and rushed him to the hospital pic.twitter.com/TcrP1Dpb1t
— Safe Telangana (@SafeTelangana) July 15, 2022
ఇదీ చదవండి: బీడీలు చుట్టి చిల్లర జమచేశాడు.. షోరూం కి వెళ్లి..
ఇదీ చదవండి: వీడియో: పోతురాజులతో కలిసి మంత్రులు తలసాని, మల్లారెడ్డి మాస్ డాన్స్!
ఇదీ చదవండి: వీడియో: ఇది పబ్లిక్ ప్లేస్! వద్దంటూ యువకుడు వారిస్తున్నా …