తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణాలో వైఎస్సార్‌టీపీ పార్టీ పెట్టి.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది. ప్రస్తుతం షర్మిల ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టింది. అయితే సోమవారం ఉదయం వరంగల్, నర్సంపేటలో.. టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆమె పాదయాత్రను అడ్డుకున్నారు. ఈ యాత్రకు సంబంధించిన బస్సుకు నిప్పు పెట్టి.. రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో షర్మిల ముఖం మీద గాయాలు కూడా అయ్యాయి. ఆమె కారు అద్దాలు కూడా పగిలిపోయాయి. ఈ నేపథ్యంలో మంగళవారం షర్మిల ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలపడం కోసం పంజాగుట్ట నుంచి ప్రగతి భవన్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో నిన్న దాడిలో అద్దాలు పగిలిన కారును స్వయంగా తానే నడుపుకుంటూ బయలుదేరారు షర్మిల. ఈ క్రమంలో పోలీసులు ఆమెను సోమాజిగూడలోనే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాగుట్టలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి.. సోమవారం జరిగిన దాడి గురించి ఆయనకు తెలియజేస్తానని షర్మిల తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట వద్ద భారీ ఎత్తున పోలీసులు, వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు.. షర్మిల కారులో ఉండగానే.. అలానే లిఫ్ట్ చేసి తీసుకెళ్లారు. క్రేన్ సాయంతో షర్మిల కారును లిఫ్ట్ చేసి తీసుకెళ్లారు. ఇక షర్మిల మాత్రం తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తన పాదయాత్రకు పోలీసుల అనుమతి ఉందని.. కానీ కావాలనే కొందరు తనపై దాడి చేశారని.. సీఎం కేసీఆర్ దీనిపై స్పందించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
#WATCH | Hyderabad: Police drags away the car of YSRTP Chief Sharmila Reddy with the help of a crane, even as she sits inside it for protesting against the Telangana CM KCR pic.twitter.com/ojWVPmUciW
— ANI (@ANI) November 29, 2022