ఈ మద్య నగరంలో కొత్త తరహాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం అర్థరాత్రి పూట ఒంటరిగా కనిపించే వాళ్లను టార్గెట్ చేసుకొని బారిని బెదిరిస్తూ.. నిలువు దోపిడీ చేస్తున్నారు.
ఈజీ మనీ కోసం ఈ మద్య కొంతమంది కేటుగాళ్ళు దేనికైనా సిద్దపడుతున్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్, డ్రగ్స్ దందా, కిడ్నాప్స్ ఇలా ఎన్నో నేరాలకు పాల్పపడుతున్నారు. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తుంటే వారిపై దాడులకు తెగబడి దోచుకు వెళ్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ మద్య దొంగలు కొత్త ట్రిక్కులు ఫాలో అవుతున్నారు.. రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్నవాళ్లను టార్గెట్ చేసి తాము పోలీసులం అని చెప్పి నమ్మించి వివరాలు అడి స్టేషన్ కి రావాలని బెదిరిస్తారు. లేదంటే డబ్బులు, నగలు ఇవ్వాలని బెదిస్తారు. ఇలా ఎంతో మందిని మోసం చేసిన ఘరానా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే…
ఇటీవల కొంతమంది కేటుగాళ్ళు నకిలీ పోలీసుల అవతారం ఎత్తి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమే కాదు.. అందినంత దోచుకు వెళ్తున్నారు. రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్నవారిని అడ్డగించడం.. మీపై అనుమానం ఉంది స్టేషన్ కి రావాలని బెదిరించి తీసుకు వెళ్లి నిలువు దోపిడి చేస్తుంటారు. ఇలాంటి వేధింపులకు గురి అవుతున్న కొంతమంది ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నకిలీ పోలీసులను పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంటరిగా ఉన్న వారినే ఎంచుకుని వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దోపిడీలు చేస్తున్నారు. పోలీసులని భయంతో చాలా మంది డబ్బులు ఇచ్చి మోసపోయారని తెలిపారు.
కౌస్తుబ్ ఘోష్ ఉపాది పని నిమిత్తం గతేడాది కిందట నగరానికి వచ్చాడు. పగటిపూట తమ పనులు ముగించుకుని రాత్రి పూట వెళుతూ తన స్నేహితుడు విశ్వనాథ్ ని పిలిపించుకుని వెళుతున్న క్రమంలో.. ఇద్దరు బైక్ పై వచ్చి వారిని అడ్డగించారు. తాము పోలీసులమని అర్థరాత్రి వేళ రోడ్ల మీద పనేంటని బెదిరించారు. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తామని చెప్పి నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి దోపిడీకి గురిచేశారు. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. డబ్బు లేకపోవడంతో సెల్ ఫోన్స్ లాక్కున్నారు. దీంతో ఆ ఇద్దరు బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా.. కేసు వారిపై నమోదైంది. కంజర్ల ఉద్యాన వనం వద్ద మద్యం తాగుతుండగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి నకిలీ పోలీసులు నగరంలో తిరుగుతున్నారని పోలీసులు వెల్లడించారు. నగరంలో జరుగుతున్న ఇటువంటి ఘోరాలపై తమ అభిప్రాయాన్ని తెలియజేయండి.