ఈజీ మనీ కోసం ఈ మాద్య చాలా మంది ఎన్నో అక్రమ దందాలు చేస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ దందాల్లో లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ వ్యవహారాలు నడిపిస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తూ అరెస్ట్ చేస్తున్నప్పటికీ.. కొత్త కొత్త ముఠాలు పుట్టుకొస్తునే ఉన్నాయి.
ఈ మద్య చాలా మంది ఈజీ మనీ కోసం ఎలాంటి పనికైనా సిద్దపడుతున్నారు. ఎదుటి వారిని మోసం చేసి తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా బెట్టింగ్ వ్యవహారాలు బాగా పెరిగిపోయాయి. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు ఒక్కటేమిటి ఎన్నో విషయాల్లో బెట్టింగ్ దందాలతో కోట్లు సంపాదిస్తున్నారు. ఎక్కువ శాతం క్రికెట్ బెట్టింగ్ లో కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయని అంటుంటారు. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా బెట్టింగ్ దందాలు నడుపుతుంటారు. ఇప్పటి వరకు మగవాళ్లే బెట్టింగ్ వ్యవహారాలు నడుపుతున్నానుకుంటే.. ఇప్పుడు ఆడవాళ్లు కూడా బెట్టింగ్ దందాలు చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యారు. ఈ ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది.
ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు దేశ వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో సైతం బెట్టింగ్ దందాలు గట్టిగానే నడుస్తుంటాయి. గుట్టు చప్పుడు కాకుండా అక్రమార్కులు బెట్టింగ్ దందా నడిపిస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. దేశంలో క్రికెట్ అంటే అభిమానించేవాళ్లు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. క్రికెట్ అభిమానుల బలహీనతే బెట్టింగ్ రాయుళ్లకు కాసులపంట. ప్రభుత్వం ఎంత నిఘా పెట్టినా.. ఎక్కడో అక్కడ ఈ ముఠాలు తమ దందాలు కొనసాగిస్తూనే ఉంటారు. ఎక్కడో అక్కడ కొత్త కొత్త ముఠాలు పుట్టుకొస్తునే ఉంటాయి. ఇప్పటి వరకు బెట్టింగ్ వ్యవహారాలు మగవాళ్లే ఎక్కువగా చేస్తున్నారన్న విషయం తెలిసిందే. కానీ ఈ మద్య ఆడవాళ్లు కూడా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా వరంగల్ లో ఓ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ బెట్టింగ్ దందాలో ఇద్దరు యువతులే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
వరంగల్ సిటీలో ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచి గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ వ్యవహారం నడిపిస్తుంది ఓ ముఠా. చాలా మంది క్రికెట్ అభిమానులు బెట్టింగ్ లో పాల్గొని తమ డబ్బులు పోగొట్టుకున్నారు. కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ దందా నడిపిస్తున్నారన్న సమాచారం పోలీసులకు తెలియడంతో అకస్మాత్తుగా దాడి చేశారు. ఛత్తీస్ గడ్, వరంగల్ కి చెందిన కొంతమంది ముఠా ఐపీఎల్ బెట్టింగ్ కి పాల్పపడుతున్నట్లు గుర్తించారు. మొత్తం ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేయగా.. అందులో ఇద్దరు యువతులు ఉన్నారు. ఈ యువతులు పలువురిని ఆకర్షించి ఐపీఎల్ లో బెట్టింగ్ పెట్టేందుకు పురిగొలుపుతున్నట్లు సమాచారం. ఈ యువతులే బెట్టింగ్ వ్యవహారంలో కీలకం అని అంటున్నారు. నిందితుల వద్ద నుంచి 3 ల్యాప్ టాప్ లు, 13 సెల్ ఫోన్ లు, 1.9 లక్షల నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వీరికి సంబంధించిన వివిధ బ్యాంకుల క్రెడిట్, డెబిట్, చెక్ బుక్ లను సీజ్ చేశారు పోలీసులు.