బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజ భవన్ ముందు మేయర్ తో సహా పలువురు కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. ఈక్రమంలో మేయర్ విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదారాబాద్ లోని రాజ్ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలపై గవర్నర్ కి ఫిర్యాదు చేసేందుకు మేయర్ విజయలక్ష్మి బృందం రాజ్ భవన్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. గవర్నర్ నుంచి సమాధానం రాకపోడవంతో రాజ్ భవన్ ముందు మేయర్ తో సహా బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఇతర నేతలు ధర్నాకు దిగారు. గవర్నర్ ను కలిసి బండిసంజయ్ పై ఫిర్యాదు చేయలని బీఆర్ఎస్ నేతలు భావించారు. అయితే అపాయింట్మెంట్ ఖరారు కాలేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. అలానే ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుండటంతో పోలీసులు అక్కడి నుంచి బీఆర్ఎస్ నేతలను పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు మేయర్ కి మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే గొంగిడి సునీత, మేయర్ విజయలక్ష్మితో సహా పలువురి కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో తెలంగాణలోని హైదరాబాద్ తో సహా పలు నగరాల్లో బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ బొమ్మను దహనం చేశారు. హైదరాబాద్ మేయర్ బృందం .. గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు మేయర్ విజయలక్ష్మి.. గవర్నర్ ను కలవాలని అనుకున్నారు.
అయితే గవర్నర్ అపాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో మేయర్ బృందాన్ని రాజ్ భవన్ లోకి అనుమతించలేదు. దీంతో వారు అక్కడే ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే రాజ్‌భవన్ వద్ద టెన్షన్ వాతావరణం కనిపించింది. గవర్నర్ నుంచి ఎంతకీ సమాధానం లేకపోవడంతో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ.. రాజ్‌భవన్ గోడకు వినతి పత్రాన్ని అంటించారు. వీరి ఆందోళన నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం కలగడంతో మేయర్ విజయలక్ష్మీతో పాటు ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్ఎస్ కార్పోరేటర్లు, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.