‘అమ్మ ఆకలి చూస్తది.. భార్య జేబు చూస్తది. కానీ నువ్వు నన్నే చూస్తున్నావు ప్రియా..’ ‘ప్రేమించడం అంటే ప్రేమను పేటీఎమ్ లో మనీలా పంపడమే.. అప్పు ఇచ్చిన వాడిలా తిరిగి ఆశించడం కాదు. ఒక వేళ ఆశిస్తే అది ప్రేమే కాదు..’ ‘దోమ కుడితే బ్లడ్ పోతది.. అదే ప్రేమ పుడితే మైండే పోతుంది..’ ఇలాంటి కోటేషన్ లను కొందరు ఆటో నడిపే యువకులు తమ ఆటో మీద రాసి పెట్టుకుంటారు. అచ్చం అలానే ఓ ఆటో డ్రైవర్.. తనలోని కవిత్వాన్ని ఆటో మీద రాసి చూపించాడు. మావోయిస్టుల దగ్గర నిషేధిత సాహిత్యం దొరకబట్టినట్లు.. పోలీసులు ఆ డ్రైవర్ ఆటోకు ఉన్న ఓ కోటేషన్ తో పట్టుకున్నారు.
“బంగారం నాకోసం నీవు మీ గడప దాటి వస్తావా.. నేను నీకోసం సప్త సముద్రాలు దాటి వస్తాను” అని ఆటో తన కవిత్వం చూపినాడు సదరు యువకుడు. అది చూసిన పోలీసు.. సప్త సముద్రాలు దాటేది తరువాత ముందు లైసెన్స్ చూపించమన్నాడు. దీంతో లైసెన్స్ లేని ఆ యువకుడు అడ్డంగా దొరికిపోయినాడు. లైసెన్స్ లేదు కానీ సప్త సముద్రాలు దాటుతాడంట.. అని పోలీసు చమత్కారంగా మాట్లాడినాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.