ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం లభించింది. 2021 సంవత్సరానికి గానూ కవిత్వ విభాగంలో గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఈ మేరకు కాసేపటి క్రితమే కీలక ప్రకటన వెలువడింది. గోరటి వెంకన్న రచించిన “వల్లంకి తాళం” కవితా సంపుటికి ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు కింద ప్రశంసా పత్రంతో పాటు రూ.లక్ష నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నారు.
పల్లె ప్రజలు, ప్రకృతి గాయకుడు గోరటి వెంకన్న రేలా రె రేలా కార్యక్రమాని న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. ప్రజాకవి, రచయిత, గాయకుడు గోరటి వెంకన్న.. 2016 కాళోజీ స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. గోరటి వెంకన్నతో పాటు తగుళ్ల గోపాల్ కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కింది. ఆయన రాసిన కవితల పుస్తకం “దండకడియం”కు ఈ అవార్డు దక్కింది.
ఇది చదవండి : బుర్ఖాలో థియేటర్ కు వెళ్లిన సాయి పల్లవి
దేవరాజు మహారాజుకు కేంద్రసాహిత్య అకాడమీ బాల సాహిత్య అవార్డు లభించింది. ఈ ఏడాది బాల సాహిత్య పురస్కారం తెలుగులో దేవరాజు మహారాజు రాసిన “నేను అంటే ఎవరు?” నాటకానికి గాను ఈ అవార్డు దక్కింది. గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.