పవన్ ప్రచార వాహనం వారాహికి తెలంగాణ రవాణా శాఖ అనుమతి ఇచ్చింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసమని వారాహి అనే పేరుతో ఆలివ్ గ్రీన్ కలర్ వాహనాన్ని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే మిలటరీ వారు వాడే ఈ రంగుని ప్రైవేటు వ్యక్తులు ఎలా తమ వాహనానికి వేసుకుంటారంటూ విమర్శలు వచ్చాయి. పలువురు మేధావులు, ఆర్టీవో అధికారులు సైతం ఈ విషయాన్ని తప్పుబట్టారు. దీంతో వారాహి రిజిస్ట్రేషన్ వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. ఆర్మీ వాహనాలకు తప్ప ప్రైవేటు వ్యక్తులు ఎవరూ ఆలివ్ గ్రీన్ కలర్ ని తమ వాహనాలకు వాడకూడదని మోటార్ చట్టం చెబుతోంది. ఈ నిబంధనలకు విరుద్ధంగా పవన్ కళ్యాణ్.. తన వారాహి వాహనానికి ఆలివ్ గ్రీన్ కలర్ వేశారని.. అందుకే రిజిస్ట్రేషన్ వాయిదా వేసిందని వార్తలు వచ్చాయి.
అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ ధీటైన సమాధానమిచ్చారు. నిబంధనలకు అనుగుణంగానే వారాహి వాహనం రంగు ఉందని, వారాహికి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ వాడారని డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు. ఆలివ్ గ్రీన్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ మధ్య సిమిలారిటీ ఉంటుందని, వెహికల్ బాడీ బిల్డర్ ఇచ్చిన సర్టిఫికెట్ ను పరిశీలించామని ఆయన అన్నారు. తమ దగ్గరకు వచ్చినప్పుడు అన్ని నిబంధనలు ఉన్నాయని అన్నారు. తర్వాత ఏమైనా మార్పులు జరిగితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. వారం రోజుల క్రితమే వాహనానికి రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. TS 13 EX 8384 పేరుతో వారాహిని రిజిస్ట్రేషన్ జరిగిందని అన్నారు. వారాహి విజయవంతంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుందన్న వార్త బయటకు రావడంతో జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘Varahi’ Registration done ✅
No issues with the colour – Confirmed by Deputy transport commissioner.pic.twitter.com/gafw4MtmoY
— Trend PSPK (@TrendPSPK) December 12, 2022