ఈ నేటి కాలంలో రోజు రోజుకు కామాంధుల సంఖ్య పెరిగిపోతుంది. కొందరు వెధవలు ఆడవారిని చూస్తే తమలోని కామాంధుడిని నిద్ర లేపుతుంటారు. ఇక తమ లైంగిక కోరికలు తీర్చుకునేందుకు ఎన్నో ఘోరాలు, దారుణాలు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి న్యూ*డ్ వీడియో కాల్స్ చేసి మహిళను వేధింపులకు గురి చేశాడు. అంతటితో ఆగక ఇంకా దారుణాలు చేశాడు. చివరకు...
ఈ నేటి కాలంలో రోజు రోజుకు కామాంధుల సంఖ్య పెరిగిపోతుంది. కొందరు వెధవలు ఆడవారిని చూస్తే తమలోని కామాంధుడిని నిద్ర లేపుతుంటారు. ఇక తమ లైంగిక కోరికలు తీర్చుకునేందుకు ఎన్నో ఘోరాలు, దారుణాలు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి తన కామవాంఛ తీర్చుకోవడం కోసం మాయమాటలతో మహిళల్ని వలలో పడేస్తాడు. తరువాత.. న్యూడ్ కాల్స్ చేయమంటూ ఒత్తిడి చేస్తాడు. ఆ తరువాత వీడియో కాల్స్ ని రికార్డు చేసి.. మహిళను బ్లాక్ మెయిల్ చేసేవాడు. అలా వారి నుంచి భారీగా నగదు కాజేశాడు. పాపం పండి.. ఓ మహిళను వేధింపులకు గురిచేయగా .. ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో అతడి కిరాతకాలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ చెందిన వక్కలపాటి చంద్రశేఖర్ ఓ వెయిట్ లాస్ సంస్థలో మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఏడాది క్రితమే ఆ ప్రముఖ వెయిట్ లాస్ కంపెనీలో మేనేజర్ గా చంద్రశేఖర్ చేరాడు. బరువు తగ్గేందు వచ్చే మహిళల ఫోన్ నెంబర్లు తీసుకుని మాటలు కలిపేవాడు. తరచూ ఫోన్ లో చేస్తూ మంచి వాడిలో మహిళతో పరిచయం పెంచుకునే వాడు. అలానే ఫిట్ నెస్ క్లాస్ ల పేరుతో వారితో చనువు పెంచుకున్నాడు. ఇక వారు తన వలలో పడ్డారని అనుకున్న తరువాత న్యూడ్ కాల్స్ చేయాలని కోరాడు. శరీర ఆకృతి గురించి చెప్తూ మహిళలను లోబర్చుకునే ప్రయత్నం చేశాడు.
అతడి మాయమాటలు నమ్మి.. కొందరు మహిళలు ఆ వలలో చిక్కారు. మరికొందరు చాకచక్యంగా తప్పించుకున్నారు. అలా తన బుట్టలో పడిన వారిని నమ్మించి, న్యూడి వీడియో కాల్స్ మాట్లాడేవాడు. ఆ వీడియో కాల్స్ ని రికార్డు కూడా చేసేవాడు. ఆ తరువాత తన నిజస్వరూపం చూపించేవాడు. రికార్డు చేసిన వీడియోలతో ఎందరో మహిళల్ని బ్లాక్ మెయిల్ చేసి.. వారి నుంచి భారీగా నగదు కాజేశాడు. తమ పరువు పోతుందన్న భయంతో కొందరు మహిళలు అతడు అడిగినంత డబ్బు ఇచ్చి.. సైలెంట్ గా ఉన్నారు. ఇలాగే కేపీహెచ్బీకి చెందిన ఓ మహిళను సైతం చంద్రశేఖర్ వేధింపులకు గురిచేశాడు. అతడి వేధింపులు తాళలేక.. సదరు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడిని అరెస్టుచేసిన పోలీసులు రిమాండ్ కి తరలించారు.
ఈ విచారణలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో రాయదుర్గం పరిధిలోని ఓ మహిళ నుంచి రూ.2 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. చంద్రశేఖర్ ఫోన్ లో 20 మంది బాధితులను పోలీసులు గుర్తించారు. ఈ 20 మంది మహిళలను చంద్రశేఖర్ లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. అర్ధరాత్రి న్యూడ్ కాల్స్ చేస్తూ వేధింపులకు గురి చేసేవాడు. బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. ఇలాంటి వారి విషయంలో మహిళలు, యువతులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.