తెలంగాణలో వనజీవి రామయ్య ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. పర్యావరణ పరిరక్షణ గురించి మొక్కలు చాటాలని ప్రతి ఒక్కరికీ చెబుతుంటారు. వనజీవి రామయ్య ఆయన సతీమణి జీవితాన్ని పూర్తిగా మొక్కల పెంపకానికే అంకితం ఇచ్చారు. ఇప్పటికే వేల మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరక్షించే బాధ్యత కూడా ఆయనే తీసుకున్నాడు. వనజీవి రామయ్య పర్యావరణాన్ని రక్షిస్తూ మొక్కలు నాటుతున్న ఎంతో మందికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు కేంద్రం పద్మశ్రీ అవార్డును ఇచ్చింది. అంతేకాదు తెలంగాణలో ఆయన చరిత్రను పిల్లలకు తెలిసే విధంగా పాఠ్యాంశంలో చేర్చింది.
వనజీవి రామయ్యకు ఖమ్మంలో రోడ్డు ప్రమాదం జరగడంతో వెంటనే ఆయనను దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందజేస్తున్నారు. మొక్కలకు నీళ్లు పోసేందుకు పల్లెగూడెం కి వెళ్లి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బైక్ కి ప్రయాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామయ్య తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న ఎంపీ సంతోష్ డాక్టర్లతో మాట్లాడి రామయ్య ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్నారు. ఆయనకు మెగుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశించారు.
ఇక వనజీవి రామయ్య ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. తాన చిన్నపుడు చెట్ల పెంపకానికి సంబంధించిన విషయాలపై ఒక టీచర్ ద్వారా ప్రభావితం అయ్యాడు. ఆ నాటి నుంచి అటవీ ప్రాంతంలో రకరకాల గింజలు సేకరించి వర్షాకాలంలో నాటుతాడు. వనజీవి రామయ్య ఆరోగ్యంగా కోలుకొని రావాలని ఆయన పర్యావరణ అభిమానులు దేవున్ని ప్రార్థిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.