మన దేశంలో హోటల్ రూమ్ బుకింగ్ సేవల్లో ఓయో సంస్థకు మంచి డిమాండ్ ఉంది. చాలా తక్కువ సమయంలోనే రూమ్స్ బుకింగ్ సేవల్లో భారీ నెట్‌వర్క్‌ను ఏర్పర్చుకున్న సంస్థగా ఓయోకు పేరుంది. అందుబాటు ధరల్లో ఏసీ, వైఫై లాంటి సౌకర్యాలను హోటల్ రూమ్స్‌లో అందించడంతో ఓయో బాగా ఫేమస్ అయింది. అయితే తాజాగా హైదరాబాద్ లోని ఓయో హోటల్లో ఓ ఆత్మహత్య ఘటన చోటుచేసుకుంది.
మన దేశంలో హోటల్ రూమ్ బుకింగ్ సేవల్లో ఓయో సంస్థకు మంచి డిమాండ్ ఉంది. చాలా తక్కువ సమయంలోనే రూమ్స్ బుకింగ్ సేవల్లో భారీ నెట్‌వర్క్‌ను ఏర్పర్చుకున్న సంస్థగా ఓయోకు పేరుంది. అందుబాటు ధరల్లో ఏసీ, వైఫై లాంటి సౌకర్యాలను హోటల్ రూమ్స్‌లో అందించడంతో ఓయో బాగా ఫేమస్ అయింది. అలానే ఎందరో ఉద్యోగులు ఈ సంస్థలో పని చేస్తూ.. తమ సేవలు అందిస్తున్నారు. ఇది ఇలా ఉంచితే.. ఓయో సంస్థలో పనిచేసే ఓ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ కుషమ్ కాష్ గ్రామానికి చెందిన అనురాద్ సింగ్ , సచిన్ సింగ్(30) ఇద్దరూ హైదరాబాద్ లోని నాచారం మల్లాపూర్ లో ఉంటూ ఓయో హోటల్ లో పనిచేస్తున్నారు. సచిన్ సింగ్ మూడు నెలలుగా మల్కాజిగిరి ప్రాంతంలోని మారుతీ నగర్ ఉన్న శ్రీ సాయి మాన్సన్ ఓయో హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈనెల 16వ తేదీన రాత్రి తన గదిలోకి వెళ్లిన సచిన్ సింగ్ గడియ పెట్టుకున్నాడు. ఆ తరువాత మరుసటి రోజు వరకు కూడా సచిన్ సింగ్ బయటకు రాకపోవడం అక్కడి సిబ్బందికి అనుమానం వచ్చింది.
చాలాసేపు తలుపు కొట్టగా లోపలి నుంచి స్పందన లేదు. చివరకు వారు తలుపు పగలగొట్టి చూడగా సచిన్ సింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందిచండంతో వారు అక్కడికి చేరుకున్నారు. హోటల్ వాళ్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటనేది ఇంక తెలియరాలేదు. అక్కడి సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. ప్రేమ వ్యవహారమా? లేకా మరేదైనా? కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.