దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. మద్యం బాబులు కూడా సూర్యుడి దెబ్బకు బీర్లను లాగించేస్తున్నారు. ఎండ దెబ్బకు హైదరాబాద్ లో కోటి బీర్లు తాగారు
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సూర్యుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. భానుడి దెబ్బకు బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఒక వేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్లిన మంచినీరు, జ్యూస్ లు, ఇతర పానీయాలను లాగించేస్తున్నారు. ఇక మందుబాబులు కూడా ఎండ దెబ్బకు బిత్తరపోతున్నారు. ఎండల ప్రభావంతో మహానగరం హైదరాబాద్లో కోటీ బీర్లు తాగేశారు.
గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును తాకుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి రాష్ట్రంలో ఎండలు దంచి కొంటాయి. దీంతో శీతల పానీయాలు, ఇతర జ్యూస్ లో అమ్మకాలు బాగా పెరిగాయి. అలానే బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా మందుబాబులు కూడా సూర్యుడిని సాకుగా చూపించి మద్యం, బీర్ల వంటివి తాగేస్తున్నారు.
ఏప్రిల్ నెలలో కేవలం పది హేడు రోజుల్లోనే 1.01 కోట్ల బీర్లు తాగేసినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఒక్క హైదరాబాద్ నగరం పరిధిలోనే కోటికి పైగా బీర్లను తాగేసినట్లు అధికారులు తెలిపారు. ఎండ దెబ్బకు తట్టుకోలేక, దాని నుంచి ఉపశమనం పొందేందుకు మద్యం ప్రియులు బీర్లు తాగుతున్నట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 8,46,175 కేస్‌ల బీర్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో సగటున 10 శాతం చొప్పున విక్రయాలు పెరిగాయి.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రికార్డుస్థాయిలో విక్రయాలు నమోదవుతున్నాయి. సాధారణంగా విస్కీ, బ్రాంది లాంటివి అలవాటున్న వారు సైతం ఎండల ప్రతాపంతో బీరు వైపు చూస్తున్నారు. ఏప్రిల్ నెలలో కేవలం 17 రోజుల్లోనే క హైదరాబాద్ లో కోటి బీర్లు తాగేశారు. అధికారులు చెప్పిన లెక్కలను చూసి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీరు తాగుడు తగలెయ్యా అంటూ కొందరు మందుబాబులను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.