పెట్రోల్ ,డీజిల్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో నిత్యావసర సరుకుల రేట్లు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీటితో పాటు బస్ ఛార్జీలు పెంచి ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ కూడా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హెదరాబాద్ లోని ప్రయాణికులకు ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
ప్రముఖ ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్స్ అసోషియేషన్ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అది ఏమిటంటే ఇక నుంచి ఓలా ఉబెర్ కార్లలో ఏసీలు బంద్ కానున్నాయి. ఈ నెల 29 నుండి క్యాబ్ లో ఏసీలు వేయకూడదని డ్రైవర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల భారం కారణంగా నష్టపోతున్నామని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేశారు.క్యాబ్ లలో ఏసీ ఆన్ చేస్తే అదనపు రుసుము చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు డ్రైవర్స్ అసోసియేషన్ తెలిపింది. ఓలా, ఉబెర్ క్యాబ్ లలో ఏసీ ని ఉపయోగిస్తే రూ.25 నుంచి రూ.50 వరకూ అదనంగా ప్రయాణికులు చెల్లించాలని తెలిపింది. ఈ నిర్ణయాన్ని క్యాబ్ డ్రైవర్లు ఎవరైన పాటించకుంటే వారిపై వేటు వేస్తామని క్యాబ్ డ్రైవర్స్ అసోషియేషన్ తెలిపింది. మరి.. ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.