హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఓ తెలుగు టీవీ ఛానల్‌లో వీడియోలు ప్రసారమయ్యాయి. ఈ ఘటన ఈ నెల 28న అర్ధరాత్రి సమయంలో జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఓ తెలుగు టీవీ ఛానల్‌లో అర్థరాత్రి అశ్లీల వీడియోల ప్రసారం కావడం కలకలం రేపుతోంది. ఈ నెల 28న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 15 నిమిషాల పాటు అశ్లీల దృశ్యాలు ప్రసారమైనట్లు సమాచారం. ఆ దృశ్యాలను చూసిన ప్రేక్షకులు వెంటనే ఛానల్ నిర్వహకులకు విషయం తెలియజేయడంతో ఛానల్ సిబ్బంది అప్రమత్తమై ఆ ప్రసారాలను నిలిపివేసారు. ఆ వివరాలు..
బంజారా హిల్స్ రోడ్ నెం.12 పరిధిలోని ఎమ్యెల్యే కాలనీలో ఓ తెలుగు టీవీ ఛానల్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ ఛానల్ హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ లైవ్ ప్రసారాలు అందిస్తుంది. అయితే ఈ ఛానల్‌లో గత నెల 28న అర్ధరాత్రి ఆకస్మాత్తుగా అశ్లీల దృశ్యాలు ప్రసారమయ్యాయి. మెుత్తం 15 నిమిషాల పాటు ఆ ప్రసారం కొనసాగింది. వాటిన చూసి వీక్షకులు అవాక్కయ్యారు. వెంటనే వారు ఛానెల్ నిర్వహకులకు విషయం తెలియజేయగా.. వారు ఆ ప్రసారాలని ఆపేశారు. ఈ ఘటనపై ఛానల్ నిర్వహకులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. తమది లైవ్ ఛానల్ అని, అర్ధరాత్రి 15 నిమిషాల పాటు అశ్లీల దృశ్యాలు ప్రసారమయ్యాయని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తమ సర్వర్‌ను ఎవరో హ్యాక్ చేసి ఉంటారని నిర్వహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.