మన సమాజంలో దొంగ బాబాలు, స్వాములు బొలేడు మంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. డబ్బు చేసుకునే వారు ఎందరో ఉన్నారు. ఇక వీరి సంగతి పక్కన పెడితే మరికొందరు జ్యోతిష్యం, న్యూమరాలజీ పేరిట భారీ మోసాలకు పాల్పడతారు. అందరు ఇలానే ఉంటారని కాదు.. కానీ కొందరు మొసగాళ్లు.. తాము ఆయా శాస్త్రాల్లో ఎంతో పరిశోధన చేసి.. ఎంతో అనుభవం సంపాదించుకున్నామని డబ్బా కొడుతుంటారు. ఎందరో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ దగ్గరకు వచ్చి సమస్యల నుంచి పరిష్కారం పొందారని గొప్పలు చెప్పుకుంటారు. ఈ ప్రచారాలు చూసి ఎందరో అమాయకులు వారి దగ్గరకు వస్తారు. అప్పుడు బయటపడుతుంది అసలు స్వరూపం. ఆ పూజలు, ఈ పూజలు అంటూ లక్షల్లో వసూలు చేస్తారు. ఇదంతా ఒక ఎత్తైతే.. ఇక సమస్యలతో వచ్చే మహిళలను వేధించడం మరో ఎత్తు. కష్టాలు తొలగిస్తామని చెప్పి.. వారిని నయానో భయానో బెదిరించి లైంగిక వేధింపులకు గురి చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది.
గోపాలకృష్ణ అనే వ్యక్తి తాను న్యూమరాలజీలో ఎంతో కృషి చేసి.. అపార అనుభవాన్ని సాధించానని చెప్పుకొచ్చాడు. మార్కెట్‌లో న్యూమరాలజీ పేరుతో చెలామణి అయ్యే వారిలో చాలామంది నకిలీ అని తెలిపాడు. తాను చేసిన కృషి గురించి పుస్తకాలు కూడా రాశానని చెప్పుకొచ్చాడు. పైగా న్యూమరాలజీ అంటే కేవలం అక్షరాలు మార్చడం మాత్రమే కాదని.. అదొక మహా సముద్రం అని చాలా గొప్పగా చెప్పాడు. ఆయన మాటలు వింటే ఎంత పెద్ద జ్ఞానో అనిపిస్తుంది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే.
మరోవైపు.. గోపాలకృష్ణ సమస్యలతో తన దగ్గరకు వచ్చే మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తాడు. వారికి అసభ్య సందేశాలు పంపి ఇబ్బంది పెడతాడు. వందలాది మంది మహిళలు ఈయన చేతిలో వేధింపులకు గురి అయ్యారు. కానీ ఎవరు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ కొందరు మహిళలు గోపాలకృష్ణ దురాగతాల గురించి ఓ మీడియా చానెల్‌కు వెల్లడించారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా చానెల్‌కు అందించారు.
ఈ క్రమంలో సదరు చానెల్ వాళ్లు.. లైవ్‌లోనే గోపాలకృష్ణ బండారం బయటపెట్టాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ముందుగా తమ చానెల్‌లో న్యూమరాలజీ మీద డిబెట్ నిర్వహిస్తున్నామని.. అతడిని ఆహ్వానించారు. అలా వచ్చిన అతడికి మైక్ అన్ని సెట్ చేసి కెమరా ముందు కూర్చొపెట్టారు. ముందుగా న్యూమరాలజీ గురించి రెండు మూడు ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత గోపాలకృష్ణ దగ్గరకు వచ్చిన మహిళలు.. ఆయన గొప్పతనం గురించి చెప్పిన వీడియో క్లిప్పింగ్‌లు తమ దగ్గర ఉన్నాయని వాటిని ప్లే చేయడం ప్రారంభించారు.
ఇంకేముందు లైవ్‌లో తెర మీద గోపాలకృష్ణ రాసలీలు బట్టబయలు అయ్యాయి. ఈ వీడియలో గోపాల కృష్ణ నగ్నంగా ఉండి.. చేతులతో బూతులు సంజ్ఞలు చేస్తూ.. వీడియో రికార్డు చేసి.. దాన్ని ఎవరికో పంపిస్తాడు. ఇక ఇక్కడ వీడియో ప్లే అవుతుంటూ స్టూడియోలో కూర్చున్న గోపాలకృష్ణను చూడాలి. చల్లగా చెమటలు పట్టి.. ఏం చేయాలో.. అర్థం కాక.. చక్కా లేచి కోటు భుజాన వేసుకుని అక్కడ నుంచి పరార్ అయ్యే ప్రయత్నం చేస్తాడు. ఇక సదరు చానెల్ వాళ్లు.. వీడియోలో ఉన్నది మీరా కాదా అని ప్రశ్నిస్తే.. వ్యక్తిగత వ్యవహారాలు లాగడం సరి కాదు అంటూ తప్పించుకున్న ప్రయత్నం చేస్తాడు. ప్రసుత్తం ఈ డిబెట్ వీడియో తెగ వైరలవుతోంది. ఇది చూసిన జనాలు మంచి గుణపాఠం నేర్పారు. అతడిని అక్కడే కట్టేసి వీడియో ప్లే చేసి.. ఆ తర్వాత బాధితులను పిలిచి.. పోలీస్ ఫిర్యాదు కూడా ఇస్తే బాగుండేది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.