బీజేపీ నేత ఈటల రాజేందర్ మరో షాక్ తగిలింది. జమునా హేచరీస్ సంస్థకు మెదక్ జిల్లా కలెక్టర్ తరపున డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16 విచారణకు హాజరుకావాలని, కానీ ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని తాజాగా జారీ చేసిన నోటీసులో అధికారులు తెలిపారు. అయితే మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం అచం పేట హకీమ్ పేట గ్రామాల్లో అసైన్డ్ భూముల కబ్జా వంటి ఆరోపణల్లో ఈటల రాజేందర్ ఉన్న విషయం తెలిసిందే. కాగా జూన్ లొనే ఈ ఆరోపణలపై నోటీసులు పంపినా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది.
దీంతో మారోసారి విచారణకు హాజరుకావాల్సిందేనంటూ నోటీసుల్లో కోరింది. ఇక ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈటల మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జమునా హేచరీస్ సంస్థకు నోటీసులు పంపటం విశేషం. అయితే గతంలో ఈటలపై భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఆయనను బర్తరఫ్ చేయటంతో బీజేపీలో చేరారు.