తల్లిదండ్రులు ఆమెను అపురూపంగా చూసుకున్నారు. అడిగవన్ని సమకూర్చారు. కోరిన చదువు చెప్పించారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తాను అన్నా సరే అన్నారు. రెండు నెలల క్రితం కెనడా వెళ్లిన యువతి మృత్యువాత పడింది. ఇంతకు ఏం జరిగింది అంటే..
డాక్టర్‌గా మారి.. పేదలకు సేవ చేయాలని భావించింది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకుంది. తల్లిదండ్రులు కూడా ఆమెను ప్రొత్సాహించారు. విదేశాలకు పంపడానికి అంగీకరించారు. మరి కొన్ని రోజుల్లో డాక్టర్ కోర్సు పూర్తి చేసుకుని.. వైద్యురాలిగా మారాల్సింది. కానీ విధి రాత మరోలా ఉంది. డాక్టర్‌గా రావాల్సిన బిడ్డ.. విగత జీవిగా ఇంటికి చేరుకుంది. అది కూడా విదేశాల్లో.. నా అన్న వారు ఎవరు లేని ప్రాంతంలో.. అత్యంత దారుణ స్థితిలో మృతి చెందింది. ఇంతకు ఆమెకు ఏం జరిగింది.. వైద్యురాలిగా మారాల్సిన యువతి.. అనూహ్యంగా ఎలా మృత్యువాత పడింది. అసలేం జరిగింది అంటే..
నిజామాబాద్, మల్కాపూర్(ఏ)కు చెందిన వెంకటరెడ్డికి ఇద్దరు కుమారులు, కుమార్తె పూజితా రెడ్డి(24) సంతానం. వెంకటరెడ్డి.. గ్రామ ఉప సర్పంచ్‌గా పని చేస్తున్నాడు. ఆయన పెద్ద కుమారుడు కొన్నాళ్ల క్రితం కెనడాలో సెటిల్ అయ్యాడు. ఇక ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీడీఎస్ పూర్తి చేసిన పూజిత.. ఉన్నత చదువులు కోసం ఈ ఏడాది జనవరి 26న కెనడా వెళ్లింది. వారం రోజుల పాటు సోదరుడి ఇంట్లో ఉంది. తర్వాత స్నేహితులతో కలిసి యూనివర్శిటీ హాస్టల్‌లో చేరింది.
కెనడాలో వైద్య విద్య చదువుతోన్న పూజితా రెడ్డి.. పది రోజుల క్రితం ఉన్నట్లుండి గుండెపోటుతో హాస్టల్ గదిలో కుప్ప కూలింది. పూజిత పడిపోయి ఉండటం గమనించిన స్నేహితులు, హాస్టల్ సిబ్బంది ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ పూజిత మృతి చెందింది. సోదరుడు.. పూజితా రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చాడు. అనంతరం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఉన్నత చదువులు కోసం విదేశాలకు వెళ్లిన కుమార్తె.. ఇలా విగతా జీవిగా తిరిగి రావడం చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. డాక్టర్ అయ్యి రావాల్సిన బిడ్డ.. ఇంత దారుణంగా కన్న వాళ్లకు దూరంగా విదేశాల్లో కన్ను మూసిన తీరు.. ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.