జిల్లా కలెక్టర్ అంటే జిల్లా మొత్తానికి పాలనాధికారి. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేసే ఉన్నతాధికారి. కానీ,.. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూకీ మాత్రం ఇందుకు పూర్తి విరుధ్ధమంటున్నారు స్థానిక ప్రజలు. ప్రజల అవసరాల కంటే తన అవసరాలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాదంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను.. తన టెన్నిస్ ఆట కోసం వినియోగించుకున్నారంటూ వార్తలొస్తున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూకీ ప్రతి రోజు సాయంత్రం జిల్లా అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో సహచరులు, ప్రముఖులతో కలిసి టెన్నిస్ ఆడుంతుంటారట. ఇక కలెక్టర్ ఆట కోసం రోజుకు ముగ్గురు చొప్పున మొత్తం 21 మంది వీఆర్ఏలకు డ్యూటీలు వేశారు. అంతే కాకుండా కలెక్టర్ ఆట కోసం వీఆర్ఏలు సరిగా పని చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి మరో 7 మంది వీఆర్వోలను నియమించారని వార్తలొస్తున్నాయి. ప్రతి రోజు సాయంత్రం ఐదున్నరకు వీరందరూ కచ్చితంగా టెన్నిస్ గ్రౌండ్ లో ఉండాల్సిందేనని.. లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: అందుకే అమెరికా నుంచి వచ్చా.. కేసీఆర్ పై కేఏ పాల్ సంచలన కామెంట్స్!
స్థానిక తహశీల్దార్ శివప్రసాద్ స్వయంగా వీళ్లందరికీ కలెక్టర్ ఆట కోసం విధులు నిర్వహించాలని ఆర్డర్ పాస్ చేశాడట. తన ఆట కోసం ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవడం సరికాదని ప్రజలు హితవు పలుకుతున్నారు. ఆట కోసం ఏకంగా 29 మంది ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ప్రోటోకాల్ ప్రకారమే వీఆర్ఏ, వీఆర్వో, ఆర్ఐలకు డ్యూటీలు వేశామని తహశీల్దార్ శివప్రసాద్ చెబుతుండటం గమనార్హం.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.