హైదరాబాద్- ఏడాదంత ఎన్ని పార్టీలు జరిగినా.. డిసెంబర్ 31న చేసే పార్టీ వేరు. ఏడాదంతా ఎంత తాగినా రాని కిక్కు.. 31 రోజు రాత్రి వస్తుంది. ఏడాదంతా ఓ లేక్క.. ఈ రోజు మాత్రమే ఓ లేక్క అన్నట్లు తెగ తాగుతారు. అయితే హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ నేరాలు భారీగా పెరగటంతో.. సీటీ పోలీసులు మందుబాబులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఎక్కడికక్కడ డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. ఇక మిగతా రోజుల్లోనే మందు బాబుల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక డిసెంబర్ 31 గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ క్రమంలో మందు బాబుల కోసం టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే వారి కోసం హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా బస్సులు నడపనున్నట్లు సజ్జనార్ తెలిపారు. సిటీ శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఒక్కరికి 100 రూపాయల ఛార్జ్ వసూలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి : ముగిసిపోయింది.. మూత పడుతుందన్నారు.. కానీ
ఆర్టీసీ సూచించిన 15 ప్రాంతాలకు ప్రాంతాలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈవెంట్స్ వెళ్లే వారికోసం రాత్రి 7.30 రాత్రి 9.30 వరకు, తిరుగు ప్రయాణం అర్ధరాత్రి 12.30 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటన చేసింది. దీంతోపాటు 18 సీట్ల ఏసి బస్సు వెళ్లి రావటానికి 4000 రూపాయలుగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది.
ఇది కూడా చదవండి : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో సంచలన నిర్ణయం
అయితే ఓ నెటిజన్ సూచన మేరకు సజ్జనార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ లో ఓ వ్యక్తి ‘సార్.. రేపు రాత్రి 1 తర్వాత బస్సులు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నుంచి నగరం నలుమూలలకు బస్సులు తిప్పాలని కోరాడు. దీంతోపాటు ఇష్టమొచ్చినట్టు రేట్లు పెట్టుకోవాలని.. ఎవ్వరూ కంప్లైంట్ చేయరంటూ పేర్కొన్నాడు. ప్రజలంతా మెచ్చుకుంటారంటూ ట్విట్ చేశాడు. అయితే.. దానికి సజ్జనార్ సమాధానమిస్తూ… రూట్లను ఫైనల్ చేస్తున్నామని రీట్విట్ చేశారు.
సార్.. @tsrtcmdoffice,
రేపు రాత్రి 1 తర్వాత బస్సులు జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ నుంచి నగరం నలుమూలలకు తిప్పుర్రి.
ఇష్టమొచ్చినట్టు రేట్లు పెట్టుకోర్రి. ఎవ్వడు కంప్లైన్ చెయ్యడు. ఉల్టా తాగినోల్లను సేఫ్ గా ఇంటికి తోలినందుకు తారిఫ్ చేస్తారు ఇంట్లోల్లు.— Mahi (@Mahi0x00) December 30, 2021
క్యాబ్ బుకింగ్ రద్దు చేస్తే జరిమానా..
అలానే న్యూ ఈయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో క్యాబ్ , ఆటో బుకింగ్ లను రద్దు చేస్తే.. సైబరాబాద్ పరిధిలో అయితే 94906 17346, రాచకొండ పరిధిలో అయితే 94906 17111కు వాహనం, సమయం, ప్రాంతం వంటి వివరాలను వాట్సాప్ చేయాలని సూచించారు. సదరు క్యాబ్ డ్రైవర్ లకు జరిమానా విధిస్తామని తెలిపారు.