రాజకియ నాయకులకు రకరకాల కార్లు ఉండట సహజమే. అందులోనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాహనం అంటే ప్రత్యేకత ఉండాల్సిందే. అందుకే రాజకీయ నాయకులు తమకు కావల్సిన అన్ని సదుపాయలతో వాటిని రడీ చేయించుకుంటారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాహన శ్రేణిలో కొన్ని కొత్త కార్లు చేరాయన్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ లల్లో మరికొన్ని వాహనాలు చేరుతున్నట్లు వార్తలు రావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. దీంతో ఆయన దేశ వ్యాప్తంగా పర్యటనలకు ప్రత్యేక వాహనాల అవసరం ఉంది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కాన్వాయ్ ను రెండు సెట్లుగా రెడీ చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఒక కాన్వాయ్ లోని వాహనాలు హైదరాబాద్ లో అందుబాటులో ఉండగా, మరో కాన్వాయ్ లోని వాహనాలను ఢిల్లీలో వాడేందుకు ఉంచబోతున్నట్లు వినికిడి. అందుకే మెత్తం 15 వాహనాలు రెడీ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏడు వాహనాలను ఒక వాహన శ్రేణిలో, మరో ఏడు వాహనాలను మరో శ్రేణిలో ఉంచనున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొన్నింటిలో జామర్ వాహనలు కూడా ఉన్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్ లోని వాహనాలను బెజవాడలో సిద్దం చేశారు. ప్రఖ్యాత వాహన తయారీ సంస్ద టాటా కేసీఆర్ కు అవసరం అయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను రెడీ చేసింది. ఇందులో భాగంగా వాహనాలకు అవసరం అయిన అదనపు ఫిట్టింగ్స్ కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక కార్గో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి తీసుకువచ్చారు. గన్నవరం సమీపంలోని మల్లవల్లి పారిశ్రామిక వాడలో వాహనాలకు అవసరం అయిన ఫిట్టింగ్స్ ను చేసిన తరువాత సాయంత్రం తిరిగి అదే కార్గో విమానంలో హైదరాబాద్ కు తరలించారని సమాచారం.
సీఎం కేసీఆర్ కు కార్లు అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయనే చాలాసార్లు పలు ఇంటర్వ్యూల్లో కూడా స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఆయన పార్టీకి కూడా కారు గుర్తునే ఎంచుకున్నారు. అవసరం అనుకున్నప్పుడల్లా కాన్వాయ్ లో కొత్త తరహా అధునాతన వాహనాలను సమకూర్చుకున్నారు. ఇటీవలే 5 ల్యాండ్ క్రూజర్ ప్రాడో వాహనాలను కూడా కొనుగోలు చేశారు. ఒక్కో వాహనం ఖరీదు రూ.కోటి 30లక్షలు. అంతకు ముందు ఉన్న ఫార్చూనర్ వాహనాల స్థానంలో వీటిని కొనుగోలు చేశారు. మరి సీఎం కేసీఆర్ వాహణ శ్రేణిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: MLA Seethakka: వీడియో: సీతక్కపై దివ్యాంగురాలి అభిమానం.. భావోద్వేగానికి గురైన సీతక్క!
ఇదీ చదవండి: Hanamkonda: చెల్లి శవంతో మూడ్రోజులుగా జాగారం.. ఆ కుటుంబంలో అందరూ అంతే!