ఫార్ములా- ఈ రేసింగ్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు బాగా వినిపిస్తోంది. ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా వరల్డ్ ఛాపింయన్ షిప్‌గా దీనిని పిలుస్తుంటారు. ఈ ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ దేశానికి రావడం పట్ల ప్రముఖులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 11న ఈ రేసింగ్ జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 11 జట్లు ఈ రేసింగ్ కోసం హైదరాబాద్ తరలివస్తున్నాయి. ఇప్పటికే ట్రాక్ ని కూడా సిద్ధం చేశారు. కార్లు సైతం విమానాల్లో హైదరాబాద్ చేరుకున్నాయి.
ఈ రేసింగ్ కోసం ఈ నెల 7 నుంచి 12 వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అందులో భాగంగా ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు ఎన్టీఆర్ మార్గ్ మూసేస్తున్నట్లు ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణం సాగించేవాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నెల 5 నుంచి 7 వరకు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్లు తెలిపారు. బస్సు రూట్లలో కూడా ఆక్షంలు ఉండే అవకాశం లేకపోలేదు. మెట్రో ప్రయాణం ఎంచుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు. లిబర్టీ, అంబేడ్కర్ విగ్రహం, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ జంక్షన్ నుంచి ప్రయాణాలు చేసేవాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
Congrats to @ktrtrs garu, @telanganacmo, @HMDA_Gov & Anil Chalamalasetty for bringing, the first-ever #NetZero sport since inception, #FormulaE to #Hyderabad, #India. Let’s make history near the picturesque Hussain Sagar Lake at #GreenkoHyderabadEPrix on February 11! @acenxtgen pic.twitter.com/J2VjBV8eMl
— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 26, 2023
దేశం మొత్తం పొగిడేస్తుంటే.. ఫార్ములా రేసింగ్ విషయంలో నగర వాసులు మాత్రం పెదవి విరుస్తున్నారు. నెట్టింట అసహనం వెల్లిబుచ్చుతున్నారు. ఈ రేసింగ్ వల్ల తమకు ఏంటి లాభం? దీనిని నగరం నడిబొడ్డున కాకపోతే వేరేచోట పెట్టుకోవచ్చు కదా? అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. నగరంలో ఉదయం, సాయంత్రం అన్ని మార్గాలు దాదాపుగా రద్దీగానే ఉంటాయి. రోజూ వెళ్లే మార్గంలో వెళ్లాలి అంటేనే చాలా కష్టం. అలాంటిది దాదాపు వారం రోజులపాటు వేరే మార్గాలు ఎంచుకుని వెళ్లాలి అంటే మాటలా? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, తారలు, వ్యాపారవేత్తలు అంతా ఈ రేసింగ్ ని పొగిడేస్తుంటే.. నగరవాసులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
After 8 years of racing around the world, we finally get our home race! @FIAFormulaE is coming to India for the first time. Thanks @ktrbrs & @GreenkoIndia for this. Come, #CheerForTeamMahindra at the #GreenkoHyderabadEPrix. @acenxtgen@MahindraRacing pic.twitter.com/aXTAqWtiaH
— anand mahindra (@anandmahindra) February 3, 2023
అయితే దేశంలో మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ హైదరాబాద్ లో జరగడం ఎంతో గొప్ప విషయం. ఈ రేసింగ్ ని హైదరాబాద్ తీసుకురావడానికి ప్రభుత్వం సైతం ఎంతో కృషి చేసింది. దేశంలో హైదరాబాద్ ని టాప్ లో నిల్చోబెట్టడానికే ప్రయత్నిస్తోంది. అయితే ఆ ఘనత, గొప్పతనాన్ని ప్రజలకు చేరవేయడంలో అధికారులు కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇంత ప్రతిష్టాత్మక ఈవెంట్ గురించి ప్రజలకు తెలిసేలా చెబితే నాలుగు రోజుల ట్రాఫిక్ కష్టాలను లెక్కచేయరనే చెప్పాలి. రేసింగ్ కోసం ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ వారం రోజులు అయినా ఈ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుందనే సూచనలు కూడా వినిపిస్తున్నాయి.
For the first time ever, #FormulaE comes to the greenest city in India as the #GreenkoHyderabadEPrix.
Thank you @MinisterKTR garu and Anil Chalamalasetty garu for putting #India on the global map.
February 11. @AceNxtGen pic.twitter.com/bwxY2f8RUW
— Vijay Deverakonda (@TheDeverakonda) January 29, 2023