బతికున్న మనిషిని చనిపోయిందంటూ ధ్రువీకరించిన జహీరాబాద్ ప్రభుత్వ వైద్యుల నిర్వాకం ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాద్ గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన అర్చనని ఇటీవల మునిపల్లి మండలం తాటిపల్లికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేశారు.
అయితే ఉపవాస దీక్షలో ఉన్న అర్చన మే 7న తెల్లవారుజామున అత్తారింట్లో కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో వెంటనే స్పందించిన అర్చన తల్లిదండ్రులు హుటాహుటిన జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక అక్కడికి చేరుకున్న అక్కడి వైద్యులు పల్స్ చెక్ చేసి బ్రాట్ డెడ్ అంటూ ఓ చీటీపై రాసిచ్చారు. దీంతో నమ్మకం కుదరని ఆ తల్లిదండ్రులు సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన అక్కడి వైద్యులు అర్చన బతికున్నట్లుగా తెలిపారు.
ఇది కూడా చదవండి: Hyderabad: ప్రియుడు అనుకుని నగ్న చిత్రాలు పంపింది! తీరా చూస్తే దిమ్మతిరిగింది!
అయితే ఆ యువతి బతికుందనే సమచారాన్ని తెలుసుకున్న జహీరాబాద్ ప్రభుత్వ వైద్యులు చనిపోయిందని రాసి ఇచ్చిన ప్లేస్ లోనే మొదట రాసిన కాగితాన్ని చింపేసి అదే స్థలంలో మరో ఆస్పత్రికి సిఫార్స్ చేసినట్లుగా రాసి ఉంచినట్లు బాధిత కుటింభికులు వాపోతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.