దేశంలో వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న.. అవగాహన కల్పించిన ఏ మాత్రం తగ్గడం లేదు. డ్రైవర్లు నిద్రమత్తు, మద్యం సేవించి అతి వేగంగా వాహనాలు నడపడం లాంటివి చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి అధికారులు అంటున్నారు. మిర్యాలగూడ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బైపాస్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది.
అటుగా వెళ్తున్న ప్రయాణీకులు బస్సు బోల్తా పడిన ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి టూ టౌన్ పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా వారిని మిర్యాలగూడం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులు 27 మంది ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ నుండి బాపట్ల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.