హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాలు మరింత శోభను సంతరించుకున్నాయి. ఇప్పటికే అత్యద్భుతంగా మారుతోన్న ట్యాంక్ బండ్ పై మరో అద్బుతం కొలువైంది.
ప్రపంచ ప్రసిద్ది చెందిన మహానగరంగా.. హైదరాబాద్ దూసుకెళ్తోంది. ఇప్పటికే వరల్డ్ క్లాస్ ఐటీ కంపెనీలకు మణిహారంగా మారింది భాగ్యనగరం. ఇక అందుకు తగ్గట్లుగానే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ను సుందరంగా తీర్చి దిద్దుతోంది. ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ సుందరీకరిస్తున్నారు కూడా. ఈక్రమంలోనే హైదరాబాద్ మణిహారంలో మరో కలికితురాయి చేరింది. NTR మార్గ్ లో ఓ మ్యూజికల్ ఫౌంటెయిన్ ను తాజాగా ప్రారంభిచారు. ప్రస్తుతం ఇది పర్యాటకులతో పాటు స్థానికులను అద్భుతానికి గురిచేస్తోంది.
హైదరాబాద్.. ఎన్నో పర్యాటక కేంద్రాలకు బిందువుగా నిలుస్తూ.. పర్యాటకులను ఆకర్షిస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వారి అభిరుచులకు తగ్గట్లుగానే వారి ఆహ్లదపరచడానికి వివిధ రకాల పార్కులను, సంస్కృతిక కళా క్షేత్రాలను అభివృద్ధి పరుస్తోంది రాష్ర్ట ప్రభుత్వం. ఈ క్రమంలోనే తాజాగా NTR మార్గ్ లో రూ. 17.2 కోట్లతో మ్యూజికల్ ఫౌంటెయిన్ ను ప్రారంభించింది. తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ ను ప్రారంభించారు.
#Ministers and Officials inaugurated musical fountain which is newly installed by HMDA in Hussain Sagar
@XpressHyderabad @Kalyan_TNIE #Telangana #Hyderabad pic.twitter.com/keKxbfaM2S
— Ireddy Srinivas Reddy (@ireddysrinivasr) February 9, 2023
180 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పులతో హుస్సేన్ సాగర్ లో ఏర్పాటు చేసిన ఈ మ్యూజికల్ ఫౌంటైన్ అద్భుతంగా దర్శనమిస్తోంది. నైట్ టైమ్ లో తళుక్కుతళుక్కు మని మెరుస్తూ.. సందర్శకులకు ఆహ్లదకరమైన సంగీతాన్ని అందిస్తోంది. ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ ను ప్రారంభించడం ద్వారా హుస్సేన్ సాగర్ కు మరింత అందం వచ్చిందంటున్నారు నెటిజన్లు. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ ను ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Hussainsagar gets a brilliant tourist attraction before to the renowned Formula E Grand Prix in Hyderabad on Saturday. Meanwhile today, a musical fountain that floats along NTR Marg was officially opened.@KTRBRS pic.twitter.com/31r8p6qann
— KTR News (@KTR_News) February 9, 2023