మునుగోడు ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 3 ఈ ఉపఎన్నిక జరగనుంది. ఫలితాలు నవంబర్ 6 వెలువడనున్నాయి. అక్టోబర్ 7న మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఈ ఉపఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ కి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.. ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనున్నారు.