ఈ మద్య సెంటు భూమి కనిపించినా కబ్జా చేసుకుంటున్న పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. కొంతమంది కేటుగాళ్ళు ఖాలీ స్థలం కనిపిస్తే చాలు.. యజమాని సంగతి పక్కన బెట్టి వెంటనే ఫేక్ డ్యాక్యూమెంట్స్ క్రియేట్ చేసి స్థలాన్ని కబ్జా చేస్తేస్తున్నారు. అసలు యజమానులు వచ్చి లబోదిబో అంటున్నారు.
ఈ మద్య కొంతమంది అక్రమార్కులు ఖాళీ స్థలం కనిపిస్తే చాటు క్షణాల్లో కబ్జా చేసేస్తున్నారు. ఈ మద్య కాలంలో భూమికి ఎంతో వ్యాల్యూ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. భూమి కోసం స్నేహ సంబంధాలు, బంధుత్వాలు సైతం మర్చిపోతున్నారు. కొన్నిసార్లు ప్రభుత్వ అధికారులు సైతం అక్రమంగా భూమిని కబ్జా చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఫేక్ డ్యాక్యూమెంట్స్ సృష్టించి అసలు యజమానులను కోర్టు చుట్టూ తిప్పిన కేసులు కోకొల్లలు. అలాంటిది సర్కార్ విధుల్లో బాగంగా తన సొంత కొడుకు అక్రమంగా నిర్మాణాన్ని దగ్గరుండి తనే స్వయంగా కూల్చి వేసిన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. డ్యూటీ ఫస్ట్.. తర్వాతనే ఏ రిలేషన్ అంటూ ఆ తల్లి చేసిన పనికి అందరూ షభాష్ అంటున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
నాగోల్ డివిజన్ ఫతుల్లా గూడలో ఎఫ్ టీఎల్ పరిధిలో కంచె లోపల ఇటీవల ఓ అక్రమ నిర్మాణం జరుపుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. అయితే ఆ అక్రమ నిర్మాణం చేపట్టింది ఫత్తుల్లాగూడ గ్రామ వీఆర్ఏ చంద్ర కళ కుమారుడు అన్న విషయం అధికారులకు తెలిసింది. తమను భయపెట్టి సదరు వీఆర్ఏ చంద్రకళ కుమారుడు అక్రమ నిర్మాణం చేపట్టారని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ గౌతమ్ కుమార్ లకు చెరువు సమీప ప్రాంతంలోని కాలనీ వాసులు ఫోటోలు పంపించి మరీ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు అధికారులు.
వీఆర్ఏ చంద్రకళ తనయుడు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని దగ్గరుండి మరీ పరిశీలించారు ఎమ్మార్వో గౌతమ్ కుమార్. వెంటనే ఆ నిర్మాణాన్ని కూల్చి వేయాల్సిందిగా అక్కడ కాపలాదారుగా సర్కార్ విధులు నిర్వహిస్తున్న చంద్రకళను ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొడుకు కట్టిన నిర్మాణాన్ని స్వయంగా కూల్చివేశారు వీఆర్ఏ చంద్రకళ. అక్రమ నిర్మాణంపై రెవెన్యూ ఇన్స్ పెక్టర్ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ అక్రమ నిర్మాణం చేపట్టిన వారినై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారు తెలిపారు. కొడుకు అక్రమ నిర్మాణం విధులు నిర్వహిస్తున్న తల్లి కూల్చి వేయడంతో అక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారింది.