గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలకు సంబంధించిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల తెలంగాణలో పోస్టర్ వార్ అడపా దడపా జరుతూ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతల మద్య పోస్టర్స్ యుద్దం నడుస్తుంది.
దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలకు సంబంధించిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఇటీవల బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్గీయుల మద్య పోస్టర్స్ వార్ నడుస్తుంది. గ్యాస్ ధరలు, పెద్ద నోట్ల వ్యవహారం, కవితపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా ఇప్పటికే పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో పోస్టర్లు కలకలం రేపాయి. తాజాగా ఉప్పల్ – నారపల్లి ఫ్లై ఓవర్ విషయంలోను మోదీపై వ్యతిరేకంగా ఈ పోస్టర్లు వెలిశాయి. వివరాల్లోకి వెళితే..
గత కొంత కాలంగా తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ పాలనను వ్యతిరేకిస్తూ కొంతమంది పోస్టర్ల ద్వారా తమ నిరసనను వ్యక్తం చేసిన విషయం తెసిందే. దీనికి కౌంటర్ గా బీజేపీ నాయకులు సైతం అధికార పార్టీ పై విమర్శలు చేస్తూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. తాజాగా హైదరాబాద్ లో మరోసారి మోదీకి వ్యతిరేకంగా మరోసారి పోస్టర్లు వెలిశాయి. ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ విషయంలోను ప్రధాని మోదీ తీరును ఎండగడుతూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘మోడీ గారు ఈ ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాలు కడతారు..?’,‘2018, మే 5న ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ పనులు ప్రారంభమై.. ఇప్పటికీ ఐదేళ్లు పూర్తయినా 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదంటూ’ అంటూ ఉప్పల్-నారపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ పై ఈ పోస్టర్లు వెలిశాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.. ఈ పోస్టర్లను ఏర్పాటు చేసినవారిని వెతికే పనిలో పడ్డారు. దగ్గరలోని సీసీ టీవి ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను వరుసగా పిల్లర్లకు అంటించుకుని వెళ్లారు. రోడ్డు పై వెళ్తున్న వాహనదారులో ఆగి మరీ ఈ పోస్టర్లను చూడటం గమనార్హం. ఇదిలా ఉంటే.. మంత్రి కేటీఆర్ మార్చి 27న ఇదే అంశంపై ట్విట్ చేవారు. తాము ఐదేళ్లలో 35 ఫ్లై ఓవర్ ప్రాజెక్టులు పూర్తి చేశాం.. కేంద్ర ప్రభుత్వం నగరంలో రెండు ఫ్లై ఓవర్లు కూడా పూర్తిగా కట్టలేపోయిందని ఎద్దేవా చేశారు. కాగా, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన మరుసటి రోజే నగరంలోని ఆ ఫ్లైఓవర్ పిల్లర్లపై ప్రధాని మోడీ పోస్టర్లు వెలువడం గమనార్హం. ఈ పోస్టర్లు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫ్లై ఓవర్ పిల్లర్లపై కూడా దర్శనమిస్తున్నాయి. దాదాపు ఆరు కిలోమీటర్ల మేర ఉన్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్లపై ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ పోస్టర్లను పలువురు బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కావాలనే అధికార పార్టీకి చెందినవారు చేస్తున్నారని.. బీఆర్ఎస్ నేతలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర సర్కార్ వ్యవహారాల తీరు వల్లనే ఫ్లై ఓవర్ పనులు ఆలస్యం అవుతున్నాయని ధ్వజమెత్తారు. ఇటీవల తెలంగాణలో పలు చోట్ల మోదీకి వ్యతిరేకంగా బై బై మోదీ, దశకంఠుడి రూపంలో మోదీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Lakhs of commuters facing inconvenience between Uppal-Narapally over the years due to the snail pace work of the Central Govt
While the TS govt completed more than 35 SRDP projects at a rapid pace, people nailing the incompetence of #Modi govt on the pillars of the ongoing… pic.twitter.com/myreiMpp7Z
— Jagan Patimeedi (@JAGANBRS) March 28, 2023