ఢిల్లీ లిక్కర్ స్కాంలో నెక్ట్స్ అరెస్ట్ అయ్యేది ఎమ్మెల్సీ కవిత నేనా? ప్రస్తుతం ఏ న్యూస్ ఛానల్ చూసినా ఇదే చర్చ. ఈ చర్చపై తాజాగా పూర్తి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న స్కాం ఢిల్లీ లిక్కర్ స్కాం. ఈ స్కాంలో ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలు పలువురుపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కాంలో కొన్ని రోజుల క్రితమే ఢిల్లీ ఆరోగ్య మంత్రి మనీశ్ సిసోడియాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ స్కాంలో తెలంగాణ భారాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు కూడా ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి, జైలు జీవితం గురించి కవితకు కాస్త ఘాటైన ప్రశ్నలే ఎదురైయ్యాయి. ఈ ప్రశ్నలకు ఎమ్మెల్సీ కవిత ఏం సమాధానాలు ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నెక్ట్స్ అరెస్ట్ అయ్యేది ఎమ్మెల్సీ కవిత నేనా? ప్రస్తుతం ఏ న్యూస్ ఛానల్ చూసినా ఇదే చర్చ. ఈ చర్చపై తాజాగా పూర్తి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. తాజాగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూలో ఢిల్లి లిక్కర్ స్కాంలో తన పేరు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇచ్చారు కవిత. జైలుకు వెళ్లడానికి కవిత పూర్తిగా మానసికంగా సిద్దం అయ్యారా? అని యాంకర్ ప్రశ్నించగా.. కవిత ఈ విధంగా సమాధానం ఇచ్చారు.”భాజాపా చేస్తున్న ఈ కుటిల రాజకీయాల్ని మేం సమర్ధవంతంగా ఎదుర్కొంటాం. ఇలా కేసుల పేరు చెప్పి బయటపెట్టాలని చూస్తే.. మేం భయపడే రకం కాదు. నేను కేసీఆర్ బిడ్డను, ఏ తప్పు చేయలేదు. ఇక ప్రజా జీవితంలో వచ్చే ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నింటిని ఎదుర్కొంటాం. భాజాపా వైఫల్యాలను, భారాసా విస్తరణను కొనసాగిస్తాం” అని చెప్పుకొచ్చారు కవిత.
ఈ క్రమంలోనే లిక్కర్ స్కాంలో నాపై చేస్తున్న ఆరోపణలు అన్ని నిరాధారమైనవి అని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.ఇక తాత్కాళికంగా మమ్మల్ని ఇబ్బందులకు గురిచేయోచ్చు కానీ.. ప్రజా ప్రయోజనాలు దృ ష్టిలో పెట్టుకునే మాలాంటి వాళ్లను కాపాడుకుంటాం అని ఈ అన్నారు. ఇక మా ఇంటికి చాలా మంది చూట్టాలు వస్తున్నారని, భవిష్యత్ లో వచ్చే చూట్టాలని కూడా ఆహ్వానిస్తామని సీబీఐ, ఈడీలను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రం విసిరారు కవిత. మరి ఢిల్లీ లిక్కర్ స్కాంపై కవిత ఇచ్చిన సమాధానాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.