గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తెలంగాణ హైకోర్టులో ఉపశమనం లభించింది. కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జైలు నుంచి విడుదల సందర్భంలో ఆయన కుటుంసభ్యులు మాత్రమే ఆయనతో ఉండాలని స్పష్టం చేసింది. ప్రెస్‌మీట్‌లు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయోద్దని రాజాసింగ్‌ను హెచ్చరించింది. అంతేకాదు! సభలు, సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొనకూడదని కండీషన్ పెట్టింది. కాగా, రాజాసింగ్‌న ఆగస్టు 25న ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం ఆయన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక, ఆనాటినుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. 2004నుంచి ఇప్పటివరకు రాజాసింగ్‌పై 101కిపైగా క్రిమినల్ కేసులు ఉన్నట్లు.. 18 కమ్యూనల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రాజాసింగ్‌ను 12 నెలల పాటు జైల్లో ఉంచేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 90 జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ భార్య టి.ఉషాబాయి హైకోర్టును ఆశ్రయించారు. ఆయనపై ఉన్న పీడీయాక్ట్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక, అప్పటినుంచి కోర్టులో విచారణ జరుగుతోంది. తాజా, తీర్పుతో రాజసింగ్‌కు ఉపశమనం లభించింది.