పార్టీ వల్ల, నేతల వల్ల లబ్ధి పొందిన కార్యకర్తలు చాలా అరుదు. కానీ పార్టీ కోసం, అభిమాన నాయకుల కోసం ఆస్తులు అమ్ముకుని మరీ ప్రచారం చేసి.. ఆఖరకు రోడ్డున పడ్డ కార్యకర్తలు ఎందరో ఉన్నారు. పార్టీ కోసం సర్వం కోల్పోయిన మహిళా కార్యకర్త దీన స్థితి చూసి చలించిపోయాడు మినిస్టర్. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే..
మన సమాజంలో ఎదుటు వారి నుంచి ఏం ఆశించకుండా ప్రేమను పంచే వారు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది అమ్మ. ఆ తర్వాత వెంటనే చెప్పాల్సింది అభిమానులు. అవును సినిమా వాళ్లు, స్పోర్ట్స్ పర్సన్స్, రాజకీయ నాయకులు.. వీరందరికి ఉండే అభిమానులు గురించి చెప్పుకోవాలి. ఎదుటి వారి నుంచి ఆశించకుండా.. కేవలం అభిమానం మాత్రమే పంచుతారు. ఇక ఏదైనా రాజకీయ పార్టీలో గుర్తింపు రావాలంటే.. ఒకటి బ్యాగ్రౌండ్ ఉండాలి.. లేదంటే బాగా డబ్బుండాలి. ఇవేవి లేవంటే.. కష్టపడుతూ ఏదో ఒక రోజు అవకాశం రాకపోదా.. గుర్తింపు దక్కకపోదా అని ఎదురుచూస్తూ ఉండాలి. ఇక కొందరు మాత్రం.. అసలేం ఆశించకుండా.. చెప్పాలంటే తన డబ్బులు ఖర్చు చేసుకుని మరీ పార్టీ కోసం పాటు పడతారు. అలా పార్టీని నమ్ముకుని.. ఆస్తులు పొగొట్టుకుని.. దారుణంగా నష్టపోయిన కార్యకర్తలు ఎందరో ఉన్నారు.
అయితే అలాంటి వారిని పార్టీ ఆదుకుంటుందా అంటే లేదు. కానీ కొందరు నేతలు మాత్రం.. పార్టీ కోసం నష్టపోయిన కార్యకర్తలను ఆదుకుంటారు. తాజాగా బీఆర్‌ఎస్ మినిస్టర్ ఒకరు పార్టీ కోసం పాటు పడి నష్ట పోయిన కార్యకర్తను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆ వివరాలు.. కార్యకర్త అందునా మహిళా కార్యకర్త దీన సిత్థి గురించి తెలిసి చలించిపోయారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అండగా ఉంటాను.. ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అంతేనా.. ఆ కుటుంబంతో కలిసి భోజనం చేశారు. ఈ ఘటనతో.. పార్టీ కార్యకర్తలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంతటి ప్రాధాన్యమిస్తారో మరోసారి నిరూపితం అయ్యింది అంటున్నారు.
శనివారం రోజు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పట్టణంలోని బంజారా కాలనీకి చెందిన ఇందిర అనే మహిళా కార్యకర్త ఈ సమావేశంలో పాల్గొంది. ఈ సభలో ప్రసంగించిన ఇందిర.. తన ఆర్థిక పరిస్థితి గురించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చింది. ఆమె మాటలు విని చలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఇందిర కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
సమావేశం అనంతరం ఇందిరతో పాటు ఆమె కూతురు, కొడుకుతో కలిసి భోజనం చేశారు. తానే స్వయంగా వారికి భోజనం వడ్డించారు. సాక్షాత్తు ఓ మంత్రి.. తనలాంటి ఓ సాధారణ కార్యకర్త ఆవేదనను ఇంత ఓపికగా విని ఎంతో భరోసాను ఇచ్చినందుకు ఇందిర ఆనందభాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు. మరి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.
సమావేశంలో ప్రసంగించి తన ఆర్థిక పరిస్థితి గురించి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆమె ఆర్థిక పరిస్థితికి చలించిన మంత్రి వారికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందిరతో పాటు ఆమె కూతురు, కొడుకుతో కలిసి భోజనం చేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి తెలిపారు. pic.twitter.com/KNaBPnwbSP
— VSGOffice (@VSGOfficeMBNR) March 25, 2023