తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి సత్యవతి తండ్రి లింగయ్య నాయక్ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ప్రస్తుతం మంత్రి సత్యవతి రాథోడ్ మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ వార్త తెలియగానే మేడారం జాతర పనుల్లో ఉన్నమంత్రి సత్యవతి రాథోడ్ సొంతూరుకు బయలుదేరారు.
గత వారం నుంచి మేడారంలోనే ఉంటూ… జాతర పనులను పర్యవేక్షిస్తున్నారు. జాతరకు ముందు రోజు ఇలా జరగడంతో మంత్రి ఇంట తీవ్ర విషాదం అలుముకుంది. కాగా, ఇవాళ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్బంగా పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాల్లో ఉండగా మంత్రి ఇంట విషాదం నెలకొనడం సత్యవతి అభిమానులను విషాదంలో ముంచెత్తింది.