తెలంగాణ మినిస్టర్ సత్యవతి రాథోడ్ కాన్వాయ్‌కి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు బోల్తా పడింది. ఆ వివరాలు..
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి వద్ద మంత్రి సత్యవతి రాథోడ్ ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం జరిగింది. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ప్రారంభించి.. తిరిగి వెళ్తున్నార. ఈ క్రమంలో సత్యవతి రాథోడ్ కాన్వాయ్ తాడ్వాయి వద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం, కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం రెండు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో.. అటు బొలేరో వాహనం బోల్తా పడగా.. ఇటు ఎస్కార్ట్ వాహనం తీవ్రంగా ధ్వంసమైంది.
ఇక ఈ ఘటనలో ఎస్కార్ట్ సిబ్బందితో పాటు బొలెరో వాహనం డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారందరినిన.. దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఈ ఘటనలో మంత్రి సత్యవతి రాథోడ్‌కి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక జిల్లా పర్యటనలో భాగంగా సత్యవతి రాథోడ్ ముప్పనపల్లి గ్రామంలో.. జీసీసీ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకుతో పాటు మండల ప్రజా పరిషత్ కార్యాలయం, పల్లె ధవఖానను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. అనంతరం ఏటూరు నాగారం ప్రభుత్వ హాస్పటల్‌లో రోగ నిరోధక నిర్ధారణ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సీతక్కతో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.