చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చెంతన ఉన్న ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ట్రిబుల్ ఐటి కళాశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. వివాదాలు, ఆందోళనలతో వార్తలకెక్కుతోంది. తాజాగా ట్రిబుల్ ఐటీ విద్యార్థులు తల్లిదండ్రుల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు బైఠాయించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
గతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన మామీలు అమలు కాలేదని.. ఇన్ చార్జ్ వీసీ వ్యవహార శైలి అస్సలు బాగాలేదని.. విద్యార్థుల భవిష్యత్ తో ఆటలాడవద్దని మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకనైనా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని.. విద్యార్థుల డిమాండ్స్ పరిష్కరించాలని.. ఇన్స్ రెన్స్ పేరుతో కోట్ల స్కామ్ జరిగిందని.. వీసీ హామీలను నమ్మే పరిస్థితి లేదని బాసర ఐఐటీ పేరెంట్స్ కమిటీ అన్నారు.
గత కొన్ని రోజులు నుంచి బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలతో నిండిపోయిందని.. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై దృష్టి పెట్టకుంటే.. పిల్లలతో కలిసి మౌన దీక్ష చేపడతామని బాసర ఐఐటీ పేరెంట్స్ కమిటీ తెలిపారు. ప్రస్తుతం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.