ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్, పూజితల వివాహానికి అన్ని రంగాల ప్రముఖులు తరలి వచ్చారు. పార్టీలకు అతీతంగా నేతలు తరలి రాగా, ఈ పెళ్లి వేడుక ఆసక్తికర భేటీలకు వేదికగా నిలిచింది. సినీ పరిశ్రమ సమస్యలపై నిన్న సినీరంగ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని హైదరాబాద్ లో నటుడు మోహన్ బాబును కలిశారు.
సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు.. గురువారం ఏపీలో జరిగిన సినీ ప్రముఖులు భేటి గురించి వీరిద్ధరు చర్చించుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే నిన్న జరిగిన సమావేశానికి మోహన్ బాబు హాజరవ్వలేదు. ఇక సినీ రంగ సమస్యలపై నిన్న సీఎం జగన్ తో సినీ ప్రముఖులు సమావేశం కాగా, ఆ భేటీ తీరుతెన్నులపై మోహన్ బాబుకు మంత్రి వివరించారు. ఆ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను ఆయనకు తెలియజేశారు.
ఇది చదవండి: ఎన్నికల ప్రచారంలో “కచ్చాబాదం”.. వీడియో వైరల్
ఇదిలా ఉంటే గత కొంత కాలంగా సినిమా టికెట్ రేట్లు, సమస్యల గురించి గత కొన్ని నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే ఈ సమస్యలను పరిష్కరించేందుకు నిన్న సినీ ప్రముఖులు సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, నారాయణ మూర్తి, అలీ, పోసాని ఈ సమావేశంలో పాల్గొన్నారు. 5 షోలకు సంబంధించి పర్మిషన్ వంటి సమస్యల పట్ల మాట్లాడిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరల సమస్యలకు ఈ భేటీతో దాదాపుగా తెరపడినట్టేనని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మోహన్ బాబుతో మంత్రి పేర్ని మీటింగ్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.