ఓ ఐఏఎస్ అధికారి భార్య తన ఇంట్లో పని చేసే యువతి పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించిందో.. మానవత్వం అన్న మాటే మర్చిపోయి.. చిత్రహింసలకు గురి చేసిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బాధితురాలు స్వయంగా తాను ఎలాంటి నరకాన్ని చూసింది వివరించిన వీడియో వైరల్‌గా మారింది. చాలా మంది సునీతకు మద్దతుగా నిలిచారు. ఆమెను హింసించిన సీమా పాత్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా సునీత ఉదంతంపై తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ స్పందించారు. సునీతను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆమె చదువకయ్యే ఖర్చును భరిస్తానని తెలిపారు. ఆ వివరాలు..
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీత.. సీమా చేతిలో ఎంతటి నరకాన్ని అనుభవించిందో వివరించింది. అంతేకాక.. తన అదృష్టం బాగుండి కోరుకుంటే తనకు బాగా చదువుకోవాలని ఉందని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోని ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాదత్ తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘‘సునీత పళ్లు విరిగిపోయాయి.. గత ఎనిమిదేళ్లుగా తను నరకం అనుభవించింది. సీమాపాత్ర ఆమెను అత్యంత క్రూరంగా హింసించింది. కోలుకున్న తర్వాత చదువుకోవాలని ఉందని బాధితురాలు చెబుతోంది’’ అంటూ ట్వీట్ చేసింది.
దీనిపై మినిస్టర్ కేటీఆర్ స్పందించారు. సునీత చదువుకు అయ్యే ఖర్చును భరించేందుకు తాను సిద్ధమని తెలిపారు. అంతేకాక సునీత కుటుంబ సభ్యుల వివరాలను తనకు పంపాలని కోరారు. అదుకు బర్ఖా దత్ స్పందిస్తూ.. అలాగే చేద్దాం అని రిప్లై ఇచ్చింది. కేటీఆర్ స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Barkha, I would be happy to contribute in my personal capacity to the young girl’s education
Please send me her family’s details https://t.co/bZ3VLO5EmF
— KTR (@KTRTRS) August 31, 2022