గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షం వర్సెస్ బీజేపీ కి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగుతున్నారు. వడ్ల రాజకీయం తర్వాత బీజేపీ-టీఆర్ఎస్ మధ్య రాజకీయ సమరం రంజుగా సాగుతుంది. రైతులను మోసం చేస్తూ ఇప్పుడు బీజేపీ చేస్తున్న వడ్ల రాజకీయం వింటానికే విచిత్రంగా ఉందని.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్రానికి ఎక్కువగా నిధులు తెలంగాణ నుంచే వెళ్తున్నాయని.. కానీ కేంద్రం మాత్రం తెలంగాణకు నిధుల విషయంలో వివక్ష చూపిస్తుందని అన్నారు విమర్శించారు కేటీఆర్. ఇవన్నీ రుజువులతో నిరూపిస్తామని.. తప్పని చెబితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఈ మాట తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేశాక సాధారణ ఎమ్మెల్యేగానే తాను కొనసాగుతానని కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో బీజేపీ తరుపు నుంచి ఎంపీలు గా గెలిచిన వారు ఏనాడైనా ఇక్కడ రైతు సమస్యల గురించి ప్రధానిని కలిశారా అన్ని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటీ గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ది చెబుతారని అన్నారు. ఏనాటికైనా తెలంగాణ కోసం కేసీఆర్ కడుపులో ఉండే బాధ, కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఉండదన్నారు కేటీఆర్.