ఈ సమాజంలో ఆడపిల్ల ఎవరి మద్దతు, రక్షణ లేకుండా బతకడం అంటే అది దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. అది కూడా మతిస్థిమితం లేని అమ్మాయి అయితే తప్పకుండా తల్లిదండ్రుల వద్దే ఉండాలి. అలాంటి ఓ ఆడకూతురు ఇంటి నుంచి తప్పిపోయింది. కన్నబిడ్డను దూరం చేసుకున్న ఆ తండ్రి విలవిల్లాడిపోయాడు. సుమన్ టీవీ చొరవతో ఆ తండ్రీకూతుళ్లు మళ్లీ ఒక్కటయ్యారు.
సామాన్యుడికి అండగా ఉంటాం అనేది సుమన్ టీవీ మోటో. అది కేవలం అక్షరాల్లోనే కాకుండా ఇప్పటికే చాలాసార్లు చేతల్లో చేసి చూపించాం. తాజాగా సుమన్ టీవీ చొరవతో, సుమన్ టీవీ సిబ్బంది కృషితో ఓ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కన్నవాళ్లకు దూరమైన ఓ ఆడబిడ్డను సొంతగూటికి చేర్చింది సుమన్ టీవీ. మతిస్థిమితంలేని బిడ్డను దూరం చేసుకుని విలవిల్లాడుతున్న ఆ కన్న తండ్రి ముఖంలో ఆనందాన్ని నింపింది. సుమన్ టీవీ ప్రయత్నం, ప్రేక్షకుల చొరవతో ఆ చిన్నారి ఎంతో క్షేమంగా తన తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఆ తండ్రి పడిన ఆవేదన, తిండి కూడా తినకుండా కుతూరు కోసం చేసిన అన్వేషణ సుమన్ టీవీ చొరవతో సుఖాంతమైంది.
తల్లిదండ్రుల చేయూత, సంరక్షణ లేకుండా ఒక ఆడపిల్ల ఈ సమాజంలో బతకడం అనేది దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. అదీ మతిస్థిమితం లేని అమ్మాయి అయితే ఎంత ఎదిగినా చిన్న పిల్లతోనే సమానం. అలాంటి ఆడకూతురు అయినవాళ్ల వద్దే ఉండాలి. కానీ, మతిస్థిమితంలేని వెంకటలక్ష్మి అనే అమ్మాయి హోళీ రోజున ఇంటి నుంచి బయటకు వెళ్లి తప్పిపోయింది. ఆమె కోసం తండ్రి అప్పారావు, కుటుంబ సభ్యులు వెతకని చోటు లేదు. అమ్మాయి ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎవరు ఎలా పోతే మనకెందుకు అని చాలామంది అనుకుంటున్న ఈ రోజుల్లో ప్రసాద్ అనే వ్యక్తి ఆ అమ్మాయి పరిస్థితి చూసి సుమన్ టీవీ ఆఫీస్ వద్దకు తీసుకొచ్చారు.
సుమన్ టీవీ న్యూస్ ఎడిటర్ నిరుపమ వెంటనే స్పందించి ఆ చిన్నారి వివరాలను చైల్డ్ వెల్ఫేర్ అధికారలకు తెలియజేశారు. అధికారులు వెంటనే సుమన్ టీవీ వద్దకు వచ్చి ఆ అమ్మాయిని నింబోలీ అడ్డాలోని హాస్టల్ లో ఉంచారు. సుమన్ టీవీలో వస్తున్న వీడియో చూసి ఓ వ్యక్తి ఆ విషయాన్ని అప్పారావుకి తెలియజేశారు. వెంటనే వాళ్లు సుమన్ టీవీకి చేరుకుని అధికారులతో మాట్లాడి.. ఫిర్యాదు కాపీ, వెంకటలక్ష్మికి సంబంధించిన ఆధార్ కార్డులను చూపించి అమ్మాయిని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లారు. సుమన్ టీవీ చూపించిన చొరవ, కృషికి ఆ తండ్రి ఆనంద భాష్పాలతోనే కృతజ్ఞతలు తెలియజేశాడు.