తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు పరుస్తుంది. నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రైతు బీమా పథకం, రైతు బంధు, ఆరోగ్య లక్ష్మి, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు మొదలైనవి ప్రవేశ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరేలా పథకాలను అమలు పరుస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రైతు బీమా పథకం, రైతు బంధు, ఆరోగ్య లక్ష్మి, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు మొదలైనవి ప్రవేశ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరేలా పథకాలను ప్రభుత్వం అమలు పరుస్తుంది. సంక్షేమ పథకాల్లో భాగంగా తాజాగా ‘గృహలక్ష్మి’ పథకం కూడా అమలు చేస్తున్నారు. ఇందులో ఇల్లు లేని వారికి ఆర్థిక సాయం అందించనున్నారు. అయితే ఇండ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మగవారికి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ‘గృహలక్ష్మి’ పథకం కింద వంద శాతం రాయితీతో ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఆగస్టు 10ని చివరి తేదీగా ప్రకటించారు. ఆహార భద్రదత కార్డ్ ఉండి సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు లేని వారిని అర్హులుగా ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నారు. క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపి జిల్లాలవారీగా ‘గృహలక్ష్మి’ పథకం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. మహిళల పేరు మీదే ‘గృహలక్ష్మి’ ఆర్థికసాయం అందించనున్నారు.
అయితే ప్రభుత్వం అందిస్తున్న ‘గృహలక్ష్మి’ ఆర్థికసాయం ఇండ్ల స్థలాలు, పాత ఇల్లు, రేకుల ఇండ్లు ఉన్న మగవారికి కూడా అందించాలని జల సాధన సమితి మహబూబ్ నగర్ జిల్లా కో కన్వీనర్ హెచ్. నర్సింహా ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశాడు. రాష్ట్రంలో చాలామంది నిరుపేద కుటుంబాల పిల్లలు తల్లి చనిపోయి, పెళ్లికాని వారు ఉన్నారని.. నిరుపేద కుటుంబాలకు చెందిన మగవారు కూడా ఇండ్లు లేక చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఇల్లు లేక కొంతమంది యువకులకు పిల్లను ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారని తెలిపారు. రేషన్ కార్డ్ ఉన్న మహిళలతోపాటుగా భార్యలను కోల్పోయిన మగవారికి కూడా గృహలక్ష్మి ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు. భార్య చనిపోయిన మగవారికి, పెళ్లికాని మగవారికి కూడా గృహలక్ష్మి పథకానికి అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.