‘రాజా రవీంద్ర’ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అనడంలో సందేహం లేదు. ఈ సీజన్‌లో తొలిసారి ఎవరు మీలో కోటీశ్వరులు షోలో కోటి గెలిచిన వ్యక్తి రాజా రవీంద్ర. అతనిది తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం. షోలో మొత్తం 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి… మంగళవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో చెక్కు అందుకున్నాడు. మీలో ఎవరు కోటీశ్వరులు షోలో కోటి రూపాయలు అందుకున్న తొలి కంటెస్టంట్‌గా రాజా రవీంద్ర చరిత్ర సృష్టించాడు. రాజా రవీంద్ర ఎస్సై అని అందరికీ తెలుసు. తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే.. అతను ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో ప్రొఫెషనల్. తాను గెలిచిన ప్రైజ్ మనీని కూడా ఒలింపిక్స్ లో మెడల్ గెలవడమే లక్ష్యంగా తర్ఫీదు పొందేందుకు వినియోగిస్తానని ప్రకటించాడు. ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే రాజా రవీంద్ర కోటీశ్వరుడు అయిపోయాడు అని. కానీ అది చెప్పుకోవడానికే అతనికి మొత్తం అందదు.
ఇదీ చదవండి: మీలో ఎవరు కోటీశ్వరులు షోలో రాజా రవీంద్రను అడిగిన కోటీ రూపాయల ప్రశ్న..
Wat a game and we’ll played by #RajaRavindra garu👏🏻 first ever contestant who won 1cr in all EMK/MEK shows. @tarak9999 is the first and best host signed on 1cr chèque and handed over to the contestant ❤️ #EvaruMeeloKoteeswarulu #EMK pic.twitter.com/UEDdl9ovrm
— Shankar Ganti (@dattasankar2805) November 16, 2021
విషయం ఏంటంటే.. ఇలాంటి షోలలో గెలిచిన మొత్తానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అది టీవీ షోలలో గెలిచిన ప్రైజ్ మనీ రూ.10 వేలు దాటి ఉంటే ఆ మొత్తానికి ట్యాక్స్ కట్టాలి. రాజా రవీంద్ర కోటి గెలిచాడు. ఆ మొత్తం మీద 31.2 శాతం పన్ను చెల్లించాలి. అంటే ట్యాక్స్ డిడక్షన్ పోను రాజా రవీంద్రకు 68.8 లక్షలు మాత్రమే అందుతాయి. 31 లక్షల 20 వేల రూపాయలు ప్రభుత్వానికి పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా మనం కట్టడం కాదు. ఆ ట్యాక్స్ మొత్తం కటింగ్ పోయిన తర్వాతనే మిగిలిన మొత్తం విజేతకు అందజేస్తారు. అలా రాజా రవీంద్ర పేరుకు మాత్రమే కోటీశ్వరుడు అయ్యాడు. గెలుచుకుంది 68.8 లక్షలు మాత్రమే. గెలిచిన అమౌంట్ పక్కన పెడితే మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో కోటి గెలిచిన తొలి కంటెస్టెంట్‌గా రాజా రవీంద్ర పేరు మాత్రం రికార్డ్స్‌లో ఉండిపోతుంది.
Congratulations
Raja Ravindra Garu ….❤#NTRsEMK1CroreEpisode @tarak9999 @GeminiTV pic.twitter.com/gUXT0HL31V— Raghu TaRRRak🌊 (@oosaravalli2) November 16, 2021
కోటి రూపాయిల చెక్ పైన మొదటి సంతకం చేసిన హోస్ట్ నేను – Jr NTR in #EvaruMeeloKoteeswarulu 🔥
Big Congratulations to #RajaRavindra Garu 💥
Jai NTR ✊ #ManOfMassesNTR pic.twitter.com/bEyRoIornP
— Aravind Tony 🌊 (@AravindNtr19) November 17, 2021