నిందితుడు రాజు ఆత్మహత్యపై స్పందించిన చిరంజీవి

సైదాబాద్‌ సింగరేణి కాలనీ చిన్నారి హత్య ఘటన అందరి హృదయాలను కలచివేసింది. ఎలాంటి సంబంధంలేని సామాన్యులు సైతం నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు, డిమాండ్లు చేశారు. దాదాపు వారం ఉత్కంఠ తర్వాత నిందితుడి శవం పట్టాలపై లభించింది. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త సమాన్యలకు ఆనందాన్నిచ్చింది. అలాంటి కిరాతకుడికి ఇలానే జరగాలి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. సోషల్‌ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్‌ వేదికగా స్పందించాడు.

‘అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు రాజు తనకు తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరట కలిగిస్తుంది. ఈ ఘటనపై మీడియా, పౌర సమాజం గొప్పగా స్పందించాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు పౌర సమాజం చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి’ అంటూ భావోద్వేగంగా చిరంజీవి ట్వీట్‌ చేశాడు.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV