ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయి. పెద్ద వయసున్న వారినే కాకుండా చిన్న వయసున్న వారిని కూడా గుండెపోటు బలి తీసుకుంటుంది. తాజాగా ఒక విద్యార్ధి గుండెపోటుతో మరణించాడు.
గుండెపోటు మరో విద్యార్థిని బలి తీసుకుంది. ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరినీ గుండెపోటు తీసుకెళ్లిపోతుంది. పెద్ద వయసున్న వారికే కాకుండా స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు కూడా గుండెపోటు రావడం పట్ల ప్రజల్లో ఆందోళన ఎక్కువైపోతోంది. ప్రస్తుతం గుండెపోటు అందరినీ కలచివేస్తుంది. జిమ్ చేసినా, క్రికెట్ వంటి ఆటలు ఆడినా, చదువుకున్నా ఒత్తిడి ఎక్కువై గుండెపోటు వచ్చేస్తుంది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ సమస్య మన దేశంలో ఉన్న యువకులను, విద్యార్థులను, చిన్నారులను వెంటాడుతోంది. తినే ఫుడ్ నుంచి పడుకునే బెడ్ వరకూ వచ్చిన అనేక మార్పుల కారణంగా గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయని వైద్యులు చెబుతున్నారు.
తాజాగా ఓ యువకుడు గుండెపోటుతో మరణించాడు. ఖమ్మం ట్రాఫిక్ ఎస్సై రవికుమార్ ఖమ్మం రూరల్ మండలం పెడతండాలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద కుమారుడు హేమంత్ శివరామకృష్ణ (20) కరేబియన్ దీవుల్లోని బార్బడోస్ లోని ఓ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అయితే మంగళవారం స్నేహితులతో కలిసి బీచ్ కు వెళ్ళాడు. అక్కడ కొంతసేపు ఈత కొట్టాడు. ఈత కొట్టి వచ్చిన కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలిపడిపోయాడు. స్నేహితులు ఆసుపత్రికి తరలించేలోపే హేమంత్ మృతి చెందాడు. అక్కడ ఉన్న మన భారతీయులు శివరామకృష్ణ మృతదేహాన్ని స్వస్థలానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.